బాప‌ట్ల‌లో గెలిచేది ఆయ‌నే.. లేటెస్ట్ స‌ర్వేలో ఓ షాకింగ్ విష‌యం..!

ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంది? ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? వంటి కీల‌క విషయాల‌పై ఇప్ప‌టికే ప‌లు స‌ర్వే సంస్థ‌లు కంటిన్యూగా స‌ర్వేలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆత్మ‌సాక్షి సంస్థ‌కూడా ద‌ప‌ద‌ఫాలుగా స‌ర్వేలు చేస్తున్న విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా .. ఏ పార్టీ పుంజుకుంది.. ప్ర‌జ‌లు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం దిశగా దూసుకుపోతుంది ? అనే విష‌యాల‌ను పూస‌గుచ్చిన‌ట్టు చెబుతోంది.

ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు ఇప్పు డు జ‌రిగినా.. ఎప్పుడు జ‌రిగినా.. గెలుపు గుర్రాల జాబితా ఇదేనంటూ.. ఆత్మ‌సాక్షి వెల్ల‌డిస్తోంది. ఈ ప‌రంప‌ర‌లో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.. ఎవ‌రు నిలుస్తారు..? అనేది కూడా ఈ సంస్థ తాజాగా వెల్ల‌డించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం.. టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించు కోనుంద‌ని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కించుకున్న వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ తొలి విజ‌యం అందుకోనున్నార‌ని స‌ర్వే తేల్చి చెప్పింది. గ‌త రెండేళ్ల కింద‌టే.. ఇక్క‌డ ఇంచార్జ్‌గా ఆయ‌న నియ‌మితుల‌య్యారు.

నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ.. వారి క‌ష్టసుఖాలు తెలుసుకుంటున్నారు వ‌ర్మ‌. అదే సమ‌యంలో పార్టీ త‌ర‌ఫు న కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు. ఎవ‌రు ఇబ్బందుల్లో ఉన్న పార్టీల‌కు అతీతంగా ఆర్థిక సాయాలు చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి బాప‌ట్ల‌లో టీడీపీ జెండా ఎగ‌ర‌లేదు. న‌రేంద్ర‌వ‌ర్మ‌కు ఇన్‌చార్జ్ పగ్గాలు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి రోజురోజుకు ఇక్క‌డ పార్టీ గ్రాఫ్ శ‌ర‌వేగంగా పెరుగుతూ వ‌స్తోంది.

ఇదే విష‌యం టీడీపీ అంత‌ర్గ‌త స‌ర్వేల‌తో పాటు ఇటు ప్రైవేటు ఏజెన్సీల స‌ర్వేల్లోనూ స్ప‌ష్ట‌మైంది. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ.. కాంట్ర‌వ‌ర్సీ లేకుండా ముందుకు వెళుతుండ‌డంతో ఆయ‌న గ్రాఫ్ పెరిగింద‌ని స‌ర్వే తేల్చి చెప్పింది. పైగా.. గ‌త రెండు సార్లుగా ఇక్క‌డ కోన ర‌ఘుప‌తి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేరువ కాలేక పోతున్నార‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

దీంతో త‌మ‌కు అండగా ఉంటున్న వేగేశ్న వైపే ప్ర‌జాతీర్పు ఉంటుంద‌ని ఆత్మ‌సాక్షి అంచ‌నా వేసింది. మ‌రో ఏడాది పాటు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల నాటికి ఆయ‌న మ‌రింత పుంజుకోవడం ఖాయ మ‌ని తేల్చి చెప్పింది. ఇక న‌రేంద్ర‌వ‌ర్మ గ‌త ఎన్నిక‌ల‌కు మూడేళ్ల ముందు నుంచే టిక్కెట్ వ‌చ్చినా.. రాక‌పోయినా కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉండే విష‌యంలో రాజీప‌డ‌లేదు. ఇవ‌న్నీ 25 ఏళ్ల త‌ర్వాత బాప‌ట్ల‌లో టీడీపీ జెండాను ఎగ‌ర వేయ‌బోతున్నాయ‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

Tags: andhrapradesh elections, ap politics, election news, Graph increase of TDP, political updates, polititions, tdp, ysrcp