జ‌గ‌న్ – విజ‌య‌సాయి గ్యాప్‌కు ఈ రెండే కార‌ణాలా… 2024కు ముందే సైడ్ చేసేస్తారా…!

ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావటంలో బాగా కష్టపడిన వారిలో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ముందు వరసలో ఉంటారు. గత ఎన్నికలకు ముందు ఆయన ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా చాలా చాలా కష్టపడ్డారు. ఏ నియోజకవర్గంలో ఎవరికి ? సీటు ఇవ్వాలి టిడిపిని ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలి.. అనేదానిపై విజయ్ సాయి చాలా అధ్యయనం చేసి ఎన్నికల్లో చాలా సక్సెస్ అయ్యారు.

సీఎం జగన్ కీలక నిర్ణయం - సజ్జల బాధ్యతలు సాయిరెడ్డికి: ఇక నుంచి ఇద్దరూ  ఇలా..!! | CM Jagan Given more responsibilities for MP Vijaya Sai Reddy in  Party, changes announced - Telugu Oneindia

పార్టీ గెలిచిన వెంటనే విజయ్ సాయికి జగన్ దగ్గర ఎంతో ప్రాధాన్యత లభించేది. అప్పట్లో విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో విజయ్ సాయికి ఆడింది ఆట పాడింది పాటగా సాగేది. చివరకు విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు ఎంపీ ఎంవీవీ లాంటి వాళ్లు సైతం డమ్మీలుగా మారిపోయాం అని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మంత్రి అవంతి మాట ఎవరు లెక్కచేసే వారు కాదు. మొత్తం చీమ చీటుక్కుమన్న విజయ్ సాయి క‌నుస‌న్న‌ల్లోనే జరిగేది.

అటు ఢిల్లీలోను ఎన్నికలకు ముందు నుంచే విజయ్ సాయి లాబీయింగ్‌ బలంగా పనిచేసింది. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం – బిజెపి బంధం బీట‌లువారటంలో కూడా విజయ్ సాయి వ్యూహాలు సక్సెస్ అయ్యార‌ని అంటారు. గత కొంతకాలంగా జగన్ దగ్గర విజయసాయి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. అసలు విజయ్ సాయి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చంద్రబాబు, లోకేష్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉండేవారు. కొద్దిరోజులుగా అసలు విజయసాయి చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేయటమే మానేశారు.

Differences Between Vijay Sai Reddy And Y.S Jagan Are True ? Proof Is Here  ! | Galli 2 Delhi Telugu News

ఇక ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి కూడా జగన్ ఆయనను తప్పించేసి బాబాయి వైవి సుబ్బారెడ్డిని నియమించారు. కీలకమైన ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలనుంచి తనను తప్పించడంతో విజయ్ సాయి అలిగారని అంటున్నారు. అలాగే ఒకప్పుడు జగన్ దగ్గర ఆయనకు ఉన్న స్థానాన్ని ఇప్పుడు పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేశారు. ఇక వచ్చే ఎన్నికల్లోను విజయ్ సాయి పాత్ర పార్టీ ఆఫీస్ కి పరిమితం కానుంది. ఉత్తరాంధ్ర బాధ్యతలో ఆయన వేలు పెట్టే పరిస్థితి లేదు. ఢిల్లీలో మిథున్ రెడ్డి దూకుడుతో విజయ్ సాయి వెనుకబడిపోయారు.

ఇలా ఎక్కడ ? చూసుకున్న విజయ్ సాయి హవాకు పూర్తిగా బ్రేకులు వేసేసారు. ఈ కారణాలే జగన్ కు ఆయనకు మధ్య బాగా దూరాని పెంచేసాయని అంటున్నారు. ఇక ఇటీవల విజయ్ సాయి తారకరత్న మరణం సమయంలో టిడిపి ఎమ్మెల్యే బాలయ్యకు బాగా దగ్గర కావడంతో పాటు ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. అప్పుడు కూడా రకరకాల పుకార్లు షికారులు చేశాయి. ఏదేమైనా జ‌గ‌న్‌కు, విజ‌య‌సాయికి మ‌ధ్య మొత్తానికి గ్యాప్ ఉంద‌ని వైసీపీలో బాగా చ‌ర్చ న‌డుస్తోంది.

Tags: AP, ap politics, intresting news, jagan, latest news, latest viral news, polititons ap, social media, social media post, telugu news, Tollywood, YS Jagan, ysrcp