ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో వైసీపీలో ప‌డే పెద్ద వికెట్లు ఇవేనా…?

వ‌చ్చే ఎన్నిక‌లు ఎంతో ప్రాధాన్యం సంత‌రించుకున్న విష‌యంతెలిసిందే. ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ వైనాట్ 175 అనే మంత్రాన్ని జపిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కీల‌క నేత‌ల‌కే ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. వారి చుట్టూ ఓట‌మి రాజ‌కీయాలుకూడా క‌ద‌లాడుతున్నాయి. దీంతో వైసీపీలో ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఎవ‌రు ఓడిపోతారు..? ఎన్ని వికెట్లు ప‌డిపోతాయి? అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో వైసీపీలో ప‌డే పెద్ద వికెట్లు ఇవేనంటూ.. సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

kolusu parthasarathy | Zee News Telugu

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉమ్మ‌డి కృష్నాలో గ‌న్న‌వ‌రం, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా.. అన్ని చోట్లా వైసీపీ గ‌త ఎన్ని క‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. వ‌చ్చేఎ న్నిక‌ల నాటికి ఈ రిజ‌ల్ట్ అటువైపు మారినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మరీ ముఖ్యంగా పెన‌మలూరు, జ‌గ్గ‌య్య‌పేట‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌మి ఖాయ‌మ‌ని తాజా స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

samineni udaya bhanu - Latest News in Telugu, Photos, Videos, Today Telugu  News on samineni udaya bhanu | Sakshi

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల‌కు వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని అంటున్నారు. పెన‌మలూరు నుంచి గెలిచిన కొలుసు పార్థ‌సార‌థి.. గ‌త ఏడాది ముందు వ‌ర‌కు బాగానే ప్ర‌జ‌ల‌తో ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గానికి ఏమీ చేయ‌డం లేద‌నే వాదన వినిపిస్తోంది. పైగా ఆయ‌న మంత్రి వ‌ర్గంలో చోటు ఆశ్ర‌యించారు. కానీ, అది ద‌క్క‌లేదు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్నారు. జ‌గ్గ‌య్య‌పేట‌లో సామినేని ఉద‌యభాను ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంద‌ని చెబుతున్నారు.

Aspirations of people given shape: Malladi Vishnu

ఆయన కుమారుడిపై ఆరోప‌ణలు ఇప్ప‌టికీ వినిపిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. పైగా సామినేని కూడా మంత్రి ప‌ద‌విని ఆశించారు. కానీ, రాలేదు. దీంతో ఆయ‌న కూడా హ‌ర్ట‌య్యారు.
ఇక‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో అయితే.. ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఓట‌మిని సొంత పార్టీ నాయ‌కులే రాసిపెట్టుకోవ‌చ్చ‌ని చూచాయ గా చెబుతుండ‌డంగ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌ని, ఆయ‌న వ్యాపారాలు.. వ్య‌వ‌హారాల‌కే ప‌రిమితం అవుతున్నార నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అస‌లు గ‌త ఎన్నిక‌ల్లోనే విష్ణు కేవ‌లం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి బొండా ఉమా బంప‌ర్ మెజార్టీతో గెల‌వ‌డం ప‌క్కా అని వైసీపీ వాళ్ల‌లోనే చ‌ర్చ న‌డుస్తోంది.

చేయమంటే చేస్తా - వేరే ఇంఛార్జ్ ను నియమించుకోవచ్చు: వైసీపీ ఎమ్మెల్యే  సంచలనం..!! | YSRCP Mylavaram MLA Vasanth Krishna Prasad interesting  comments on own party - Telugu Oneindia

మ‌రోవైపు.. మైల‌వ‌రం కూడా ఈ జాబితాలోనే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఏదో ఊహించుకుని ఓటేసిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌ని.. కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఓట‌మి ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇలా.. మొత్తం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా కృష్ణాలో నాలుగు వైసీపీ పెద్ద వికెట్లు ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags: ap politics, election survey, intresting news, latest news, latest viral news, political updates, politition, social media, telugu news, Tollywood, viral news, ycp leader, YS Jagan, ysrcp