ఎన్టీఆర్ బర్త్ డేకి లక్ష్మీ ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ వెన‌క ఇంత స్టోరీ ఉందా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా త‌న‌ 40వ పుట్టినరోజు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు చేసిన రచ్చ అంత ఇంతా కాదు.. పైగా 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఎన్టీఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సింహాద్రి సినిమాను కూడా పుట్టిన రోజున రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా రీ రిలీజ్‌లోనూ ఫ‌స్ట్ డే ఏకంగా రు. 5 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌తో దుమ్ము లేపింది.

అంతే కాకుండా ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా తారక్ నటిస్తున్న తన 30వ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్‌ ఆ సినిమా టైటిల్ కూడా రివీల్ చేయ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు. కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న తన 30వ సినిమాకు దేవర అనే టైటిల్‌ కన్ఫర్మ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ లుక్ కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య లక్ష్మీ ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ గురించి ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ, సోష‌ల్ మీడియాలోనూ ఓ వార్త ఇంట్ర‌స్టింగ్‌గా మారింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి త‌న భ‌ర్త‌కు పుట్టినరోజు కానుకగా ఓ ప్లాటినం బ్రాస్లెట్ గిఫ్ట్ ఇచ్చిందట.. అంతేకాకుండా ఆ బ్రాస్లైట్ పై లవ్ యు కన్నయ్య అంటూ క్యాప్షన్ కూడా రాయించిందట.

Photo Story: Abhay Celebrating Uncle's Birthday | Tupaki English

ఈ గిఫ్ట్ విలువ సుమారు కోటి రూపాయలు పైనే ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఎంతో వైరల్ గా మారింది. తన భార్య ఇచ్చిన గిఫ్ట్ కి ఎన్టీఆర్ ఎంతో సర్‌ప్రైజ్‌తో పాటు చాలా ఎమోషనల్ అయ్యాడని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ త‌న స్నేహితులు, బంధువుల‌తో చేసుకున్న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో ఎంత వైర‌ల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.