చిల‌క‌లూరిపేటలో మంత్రి ర‌జ‌నీపై నంద‌మూరి సుహాసిని పోటీ నిజ‌మేనా…!

విడుదల రజిని నాలుగేళ్ల క్రితం వరకు రాజకీయంగా ఆమె గురించి ఎవరికీ తెలియదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న రజిని అనూహ్యంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి జంప్ చేసేయటం.. వెంటనే జగన్ చిలకలూరిపేట టికెట్ ఇవ్వటం.. గత ఎన్నికలలో విజయం సాధించిన ఆమె.. గత ఏడాది మంత్రివర్గ విస్తరణలో కీలకమైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అయిపోవడం చకచక జరిగిపోయాయి. నాలుగేళ్ల నుంచి రజ‌నీ పట్టిందల్లా బంగారం అయిపోతుంది. అసలు చిలకలూరిపేట లాంటి టీడిపి కంచుకోటలో ఆమె గెలుపే ఓ సంచలనం. కేవలం వైసిపి వేవ్ లోనే రజ‌ని విజయం సాధించారు.

Andhra Pradesh extensively adopting technology in healthcare, medical  education: Vidadala Rajini, Health Minister, Government News, ET Government

తెలుగుదేశం పార్టీ అండదండలతో రాజకీయంగా ఎదిగిన రజనీ కుటుంబం ఆ పార్టీకి షాక్ ఇచ్చి వైసిపిలోకి రావటం.. ఆ వెంటనే ఎమ్మెల్యే టికెట్ రావడం.. గెలవడం మంత్రి అవ్వటం అలా జరిగిపోయాయి. రజ‌నీకి మంచి వాగ్దాటి ఉండటం చాలా ప్లస్ అయింది. అందుకే ఆమెకు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పదవులు వచ్చాయని వైసిపి నేతలు చెబుతూ ఉంటారు. ఇక ఆమెకు పోటీగా ఉన్న మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లోను చిలకలూరిపేట వైసిపి టికెట్ ఆమెదే అని తేలిపోయింది.

Nandamuri Suhasini Biography : Wiki, Personal Details, Age, Height

ఇక టీడిపి నుంచి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పోటీకి రెడీ అవుతున్నారు. అయితే కొద్ది రోజుల నుంచి టీడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మనవరాలు, దివంగత నేత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని చిలకలూరిపేటలో టీడిపి తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పైగా బాలయ్య రంగంలోకి దిగి చంద్రబాబు చేత హామీ ఇప్పించుకున్నట్టుగా కూడా చెబుతున్నారు. దీనికి బదులుగా ప్రత్తిపాటికి రాజ్యసభ సీటు లేదా ఎమ్మెల్సీ ఇస్తారని ఒక ప్రచారం అయితే నడుస్తోంది.నందమూరి సుహాసిని ఇక్కడ పోటీ చేస్తే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కమ్మ‌ సామాజిక వర్గం ఓటర్లతో పాటు.. ఎన్టీఆర్ అభిమానులు గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి దూరమైన వారు.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. వీరందరూ సుహాసినికి వన్ సైడ్ గా ఓట్లు వేస్తారని పార్టీలో కొందరు అయితే లెక్కలు వేసుకుంటున్నారు.

Case under SC/ST Act registered against former TDP minister Prathipati  Pulla Rao

పైగా నందమూరి కుటుంబం వేవ్ గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలపై కూడా పడుతుందని ప్రచారం అయితే జరుగుతోంది. వాస్తవంగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న సుహాసినిని ఏపీ రాజకీయాల్లోకి తీసుకువచ్చే ఆలోచన అయితే ఇప్పటివరకు బాబుకు లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి పుల్లారావు రజ‌నీపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. పుల్లారావు లాంటి బలమైన నేతను చిలకలూరిపేట నుంచి తప్పించేందుకు చంద్రబాబు కూడా ఇష్టపడే పరిస్థితి లేదు. అయితే సుహాసిని ఇక్కడ నుంచి రజ‌నీపై పోటీ చేస్తారు అన్నది ప్రచారం మాత్రమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావుకైతే ఎదురులేని విధంగా పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి సమయంలో ఆయనను తప్పించే రిస్క్ అయితే చంద్రబాబు చేయ‌రు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, minister rajini, nandamuri suhasini, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp