గురు హీరోయిన్ రితికా సింగ్ కెరీర్ నాశనం అవ్వ‌డానికి అదే కార‌ణ‌మైందా..!

అందం ఉన్న, నటన ఉన్న కూడా కొన్ని సార్లు హీరో, హీరోయిన్లు అవకాశాల రేసులో వెనకబడిపోతారు. పట్టుమని పది సినిమాల్లో నటించకుండానే ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతారు. మరి కొంత మంది హీరోయిన్లు విషయానికి వస్తే కొన్ని మంచి సినిమాలు చేస్తారు అంతే మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. ఆ సినిమాలకు మంచి అవార్డ్స్ కూడా వస్తాయి అయినా కూడా ఆ తర్వాత అవకాశాలు ఉండవు.

Guru telugu movie review | Venkatesh Guru Movie Review Rating | 123telugu.com

అలా నటించిన మొదటి సినిమాతో అన్ని భాషలలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ రితికా సింగ్. ఈమె మొదటి సినిమా గురుతో వెంకటేష్ సరసన నటించింది. నిజానికి ఈమె హీరోయిన్ కావాలనుకోలేదట.. మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్టిస్ట్ కావాలనుకుందట. అలా 2009 ఆసియన్ ఇండోర్ గేమ్స్ పూర్తి చేసుకున్న రితిక ఆ తర్వాత మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

2013 లో సూపర్ ఫైట్ లీగ్ లో పాల్గొన్న రితిక సింగ్ దర్శకురాలు సుధా కొంగర దృష్టి లో పడింది. చూడటానికి అందంగా ఉంటూ… అంతకన్నా అందమైన ఆట ఆడుతున్న రితికను హీరోయిన్ గా మార్చేసింది సుధా. సుధా కొంగర హిందీ మరియు తమిళంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక కథ రాసుకుంది. ఆ కథలో మెయిన్ రోల్ బాక్సింగ్ పాత్రకు రితిక అయితే సరిపోతుందని భావించి సుధా ఆమెను ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేసింది.

Tollywood 'Guru' Movie Fame Ritika Singh Latest Beautiful Photos

ఇక మాధవన్ – రితిక ప్రధాన పాత్రల‌లో తెరకెక్కిన తమిళ్ చిత్రం ఇది. ఈ సినిమా పేరు ఇరుదు సుత్రు అలాగే హిందీలో ఈ సినిమా పేరు ఖద్దూస్ అనే పేరుతో రూపొందించారు. అటు తమిళ్లో.. ఇటు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్లను సాధించి రికార్డు తిరగరాసింది. ఇక తెలుగులో వెంకటేష్‌తో గురు సినిమాలో నటించి తెలుగులో కూడా ఎంతో హిట్టును సాధించింది.

ఇలా చాలా తక్కువ సమయంలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నా కూడా ఆ తరువాత రితికాకు మంచి అవకాశాలు రాలేదు. ఇక ఆ తరువాత లారెన్స్ తో హర్రర్ మూవీలో న‌టించింది. ఆ తరువాత విజయ్ సేతుపతితో సినిమా అవకాశం దక్కించుకుంది. ఇకపోతే గత రెండేళ్లుగా సినిమా అవకాశాలు లేక రితిక ఖాళీగా ఉంటోంది. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతోనే రితికాకు ఈ ప‌రిస్థితి వ‌చ్చింది. ఆమె కెరీర్ దాదాపుగా ముగిసినట్టే కనిపిస్తుంది.