బాల‌య్య కోరుకుంది ఒక‌టి.. బోయ‌పాటి చేసింది మ‌రొక‌టి… అదిరిపోయే ట్విస్ట్‌..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న కాంబినేషన్ లో బాలయ్య … బోయపాటి కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్ లో మొదటగా సింహా మూవీ రూపొందింది. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత లెజెండ్ వీరి కాంబినేషన్లో తెర‌కెక్కింది. ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది.

Akhanda OTT Release: Nandamuri Balakrishna's 'Akhanda' to release on OTT on  THIS date! | - Times of India

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్లో వ‌చ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక‌ వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో మూవీ కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోందంటూ ర‌క‌ర‌కాల‌ వార్తలు గ‌త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా మరొకసారి ఈ క్రేజీ కాంబినేషన్‌పై వార్త ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రస్తుతం బోయపాటి యువ హీరో రామ్ పోతినేనితో ఒక మాస్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఫాన్‌ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే మరోవైపు బోయపాటి గ్యాప్ దొరికినప్పుడల్లా బాలకృష్ణ కోసం ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Watch Legend Telugu Movie on Amazon Prime | Legend Telugu Movie

ఆ సినిమాలో యాక్షన్ తో పాటు మంచి రాజకీయ అంశాలు కూడా ఉంటాయట. గతంలో లెజెండ్ లో కూడా కొన్ని రాజకీయల‌ను టచ్ చేసినా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం బోయపాటి పూర్తి పొలిటికల్ పాయింట్స్ ను స్ట్రాంగ్ గా టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బాల‌య్య అఖండ‌కు సీక్వెల్ చేయాల‌ని ఆరాట‌ప‌డుతుంటే బోయ‌పాటి లెజెండ్‌కు సీక్వెల్‌గా క‌థ రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది. వచ్చే యేడాది ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అలాగే బాలయ్యతో సినిమా కోసం మరో ఇద్దరు దర్శకులు కూడా క్యూలో ఉన్నారు. అందులో బలగం దర్శకుడు వేణుతో పాటు వాల్తేరు వీరయ్య సూప‌ర్ హిట్ అందుకున్న‌బాబీ కూడా ఉన్నాడు. కానీ బాలయ్య మాత్రం బోయపాటి సినిమా తరువాతనే మరో సినిమాకు ఓకే చేయాలని అనుకుంటున్నాడు.