రాజమౌళి ల‌వ్‌లో ఫెయిల్ అయ్యాడా… ప్రేమించిన ఇద్ద‌ర‌మ్మాయిలు ఎవ‌రంటే…!

రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యావత్ ఇండియాలోనే కాకుండా ప్రపంచమే అతని గురించి మాట్లాడుకుంటోంది. దానికి కారణం కూడా వేరే చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ దర్శకుడికి సాధ్యం కానటువంటి ఎన్నో రికార్డ్స్ ని సాధించి చూపాడు దర్శకుడు రాజమౌళి. అంతేకాకుండా భారతీయ సినిమాని ప్రపంచపటంలో నిలిపాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన మొదటి డైరెక్టర్ గా పేరుగాంచాడు.

ఇక గత ఏడాది వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకొని ఆస్కార్ అవార్డ్స్ కి ఎంపికై సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే ఇంత గొప్ప దర్శకుడు ఎంతోమంది స్టార్ నటీమణులతో పని చేసినప్పటికీ ఎవరితో ప్రేమలో పడలేదట. కానీ ఆయన ఇండస్ట్రీకి రాకముందే ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డారని ఓ మీడియా వేదికగా రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే ఆ అమ్మాయిలు రాజమౌళిని ప్రేమించకపోవడంతో ఆయన ప్రేమ ఫెయిల్ అయింది పాపం!

ఆ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు అలాంటి గొప్ప డైరెక్టర్ ని మిస్ చేసుకున్నందుకు వారు ఇప్పుడు కుమిలిపోతూ వుంటారు… అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే రాజమౌళి తన వదిన చెల్లెలు అయినటువంటి ‘రమా’ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే రమకి అప్పటికే పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే మొదటి భర్తతో విడాకులు తీసుకున్నాక రాజమౌళితో రమ ప్రేమలో పడి ఆయనని పెళ్లి చేసుకుంది. ఇక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక రాజమౌళి దశ తిరిగిందని చాలామంది చెప్పుకుంటారు. అంతేకాకుండా రాజమౌళి తన భార్య మొదటి భర్త కొడుకు కార్తీకేయ‌ను సొంత కొడుకుగా భావిస్తాడు. ఇక వాళ్లు పెళ్లి త‌ర్వాత మ‌యూఖ అనే అమ్మాయిని ద‌త్త‌త తీసుకున్నారు.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, rajamouli, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, top director, trendy news, viral news