బాలయ్య భార్య వసుంధర ఇన్ని కోట్ల‌కు అధిప‌తా… ఆమె ఇద్ద‌రు కూతుళ్ల‌కు ఇచ్చిన క‌ట్నం ఎంతంటే..!

నందమూరి కుటుంబం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ (తారక రామారావు) సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో అగ్రనేతగా ఒక వెలుగు వెలుగు తెలుగువాడి సత్తా చాటారు. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వాన్ని పుచ్చుకున్నట్లు నటనలో ఒదిగిపోయి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు అంటే అతిశయోక్తి కాదేమో.

ఇకపోతే యువరత్న బాలకృష్ణకు 1982లోనే వసుంధర దేవితో వివాహం జరిగిందనే విషయం అందరికీ విదితమే. అయితే ఆమె ఎవరి కూతురు అన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినటువంటి దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయే వసుంధర. ఆమె సొంతంగా వందల కోట్ల ఆస్తులకు వారసురాలు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమె బాలకృష్ణని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కట్నంగా ఆమె తన ఆస్తిని నందమూరి కుటుంబానికి తీసుకువచ్చిందట.

అయితే అప్ప‌టిక‌ప్పుడు రు. 10 ల‌క్ష‌ల స్పాట్ క్యాష్ అయితే వ‌సుంధ‌ర‌కు క‌ట్నంగా వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమె పేరిట ఆమె పుట్టింటి వారు చాలా స్థిరాస్తులు రాశారు. అవి ఇప్పుడు కోట్ల‌లోనే ఉంటాయి. వీరికి బ్రాహ్మణి , తేజస్వి, మోక్షజ్ఞ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బ్రాహ్మణిని నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కు ఇచ్చిన వివాహం చేయగా.. తేజస్విని వైజాగ్ గీతం సంస్థలకు చెందిన శ్రీ భరత్ కు ఇచ్చి వివాహం చేశారు.

ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇకపోతే వసుంధర దేవికి తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి మాత్రమే కాకుండా భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులు కూడా చాలా భారీగానే ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఆమె వేల కోట్ల ఆస్తులకు అధిపతి అని తెలుస్తోంది. కాగా ఆమె ఆస్తిలోని సగభాగాన్ని తన ఇద్దరు కూతుళ్ళకు ఇచ్చేశార‌ట‌.

Tags: film news, filmy updates, hero balakrishna, intresting news, latest news, latest viral news, Nandamuri Balakrishna, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news