9వ తరగతిలోనే హీరో రామ్ సంచ‌ల‌నం… టాలీవుడ్‌లో ఏ హీరో బ్రేక్ చేయని గొప్ప రికార్డ్‌…!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. త‌న ఎన‌ర్జిటిక్ యాక్టింగ్ తో అంద‌రినీ మిస్మ‌రైజ్ చేశాడు. రొమాంటిక్, క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. చాక్లెట్ బాయ్ గా అమ్మాయిల హృద‌యాల్లో గూడు క‌ట్టేసుకున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సీన్ మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు చాక్లెట్ బాయ్ గా ఉన్న రామ్ మాస్ హీరోగా అవ‌త‌రించాడు. ఉస్తాద్‌గా పేరు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు. రామ్ కెరీర్ లో తెర‌కెక్కుతున్న 20వ చిత్ర‌మిది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. రామ్ పేరిట ఓ అరుదైన రికార్డు ఉంది. ఇటువంటి రికార్డు ఇండియాలోనే కాదు, ప్రపంచం లో కూడా ఎవరికీ లేదనే చెప్పాలి.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రామ్ నటించిన మొదటి చిత్రం `దేవదాసు`. ఇందులో ఇలియానా హీరోయిన్‌. వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి ఫిలింఫేర్ సౌత్ – ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. దేవ‌దాసు సినిమా స‌మ‌యానికి రామ్ వ‌య‌సు 15 ఏళ్లు మాత్ర‌మే. అప్ప‌టికి ఆయ‌న 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు.

అంత చిన్న వయస్సులో మెయిన్ లీడ్ హీరో గా అడుగుపెట్టిన వాళ్ళు అంతకు ముందు ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు. 9వ త‌ర‌గ‌తిలోనే సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాదు.. తొలి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నాడు. అప్ప‌ట్లోనే దేవ‌దాసు చిత్రం రూ. 18 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అలాగే 17 కేంద్రాల్లో 175 రోజులు ఆడిందీ సినిమా. హైదరాబాద్ లోని ‘ఒడియన్’ థియేటర్ లో ఏకంగా 200 రోజులకు పైగా ఆడింది. ప్ర‌పంచంలోనే ఇలాంటి సెన్సేషనల్ రికార్డు 15 ఏళ్ళ వయసులో రామ్ కు మాత్ర‌మే ద‌క్కింది

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, ram pothineni, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news