ఈ అలీగాడు “గోడ మీద పిల్లా”..? డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు . ఈ తంతు ఎప్పటినుంచో జరుగుతూ వస్తూ ఉంది . అయితే అలా వచ్చినవాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరుతోనే ఉన్నారా అంటే లేదనే చెప్పాలి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీస్ రాజకీయాల్లోకి వచ్చి తమదైన స్టైల్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేదని చెప్పాలి . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కమెడియన్ అలీ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతుంది.

మనకు తెలిసిందే కమెడియన్ అలీ రాజకీయాల్లో కూడా తరదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నాడు . ఓవైపు సినిమాలు.. మరోవైపు బుల్లితెర పై షోలు ..మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నఅలీ..రీసెంట్గా తన కజిన్ కొడుకు సదన్ ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం “భారీ తారాగాణం” అనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు . ముఖ్యఅతిథిగా పాల్గొన్న అలీ ఈవెంట్ లో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు .

Comedy Kings - Brahmanandam,Ali Comedy In Snehamante Idera -  Brahmanandam,Ali, Sudhakar - YouTube

ఈ క్రమంలోని స్టేజిపై మైక్ పట్టుకొని మాట్లాడిన అలీ.. తనకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది అంటూ బిగ్ బాంబు పేల్చాడు. ” పెద్ద సినిమాలు డబ్బింగ్ అవుతాయి రీమిక్ కూడా అవుతాయి. కానీ చిన్న సినిమాలను ఎందుకు ఎవరూ పట్టించుకోరు అంటూ సంచలన కామెంట్స్ చేశారు . ఎంత బాగున్నా సరే మన సినిమాలను వేరే వాళ్ళు రిలీజ్ చేయరు. పెద్ద సినిమాలు మాత్రమే చూస్తూ ఉంటారు .ఆ విషయం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాదు . మన తెలుగు ఆడియన్స్ చాలా గొప్ప వాళ్ళు అందుకే ఇతర భాషల నుంచి డబ్బింగ్ అయిన సినిమాలను మనం బాగా ఆదరిస్తాం ప్రేమిస్తాం. కాంతారా తదితర చిత్రాలను మనం ఎంత పెద్ద హిట్ చేశామో చూసాం . అలాగే ఇంగ్లీష్ – హిందీ -కన్నడ -మలయాళం చిత్రాలను కూడా మనం బాగా ఆదరిస్తాం”.

 

“అదే మన తెలుగు సినిమాలు పక్క ఇండస్ట్రీలో రిలీజ్ అయ్యి హిట్టు కొట్టిన దాఖలాలు లేవు. పెద్ద సినిమాలను రీమేక్ చేసే దర్శక నిర్మాతలు.. చిన్న సినిమాల జోలికి రారు ..అది ఏంటో ఇప్పటికే అర్థం కావడం లేదు “అంటూ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే పలువురు యాంటి అలీ ఫ్యాన్స్ రాజకీయాల పరంగా వ్యాఖ్యలను లాకొస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో చిన్న సినిమాలు విడుదలయ్యాయి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాయి ..అయినప్పటికీ ఆలీ నోరు విప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన ఫ్యామిలీ హీరో అయ్యే సరికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు . అలీ క్యారెక్టర్ అంతే గోడమీద పిల్లి ..తనకు అవసరమైతే ఎలాంటి పనులైనా చేస్తాడు అంటూ ఘాటుగా రాజకీయాలను ఉద్దేశించి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలీ పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది..!!

Tags: actter ali, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news