హీరోయిన్ డింపుల్ హయాతి అత‌డితో రిలేషన్ షిఫ్‌లో ఉందా.. బ‌య‌ట‌కొచ్చిన టాప్ సీక్రెట్‌…!

రామబాణం, ఖిలాడి వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది డింపుల్ హయాతి. ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే – డింపుల్ హయాతీ మధ్య జ‌రిగిన గొడ‌వ కారణంగా డింపుల్ పేరు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలోనే కాక డిజిటల్ మీడియాలో కూడా వినిపిస్తుంది. అయితే దీనిపై విచార‌ణ‌, చ‌ర్చ జ‌రుగుతున్న క్ర‌మంలోనే డింపుల్ హయాతి గురించి మరొక సీక్రెట్ బయటపడింది.

Atrangi Re actress Dimple Hayathi booked for damaging police officer's car  in Hyderabad; visuals surface

ఐపీఎస్ అధికారి రాహుల్ కి, డింపుల్ కి మధ్య జరిగిన వివాదంలో తన కారును ఉద్దేశపూర్వకంగానే డింపుల్ తన్నిందని.. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కారుని ఢీ కొట్టిందని రాహుల్ ఆరోప‌ణ‌. ఇక సిసి ఫుటేజ్ ప్రకారం అలాగే రాహుల్ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం డింపుల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు విచార‌ణ క్ర‌మంలోనే మ‌రో కొత్త విషయం బయటపడింది.

Actress Dimple Hayathi is too hot to handle this summer - Hashtagu Telugu

అదేంటంటే డింపుల్ హయాతి తన బాయ్ ఫ్రెండ్ అయిన‌ డేవిడ్ విక్టర్‌తో కలిసి హైదరాబాదులో ఒకే ఇంట్లో ఉంటుందట. ఐపీఎస్ అధికారి రాహుల్ ఉంటోన్న ప్లాట్ల స‌ముదాయంలోనే డింపుల్ త‌న భాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి ఉంటోంది. ఈ విషయం రాహుల్.. డింపుల్ మధ్య జరిగిన గొడవల విషయంలో బయటపడింది.

Dimple Hayathi: Dimple Hayathi hit the IPS officer's car and kicked her..  Case registered

ఈ విష‌యం తెలిసిన చాలా మంది సినీ జనాలు, అలాగే నెటిజన్లు డింపుల్ డేవిడ్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉందని.. వారిద్దరి ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని.. వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే డింపుల్ పై ఎఫైర్ వార్తలు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ వార్తలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.