చిరంజీవి ఓ ముసుగు దొంగ లాంటోడు… విజయశాంతి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, విజయశాంతి జోడికి భలే క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో జోడిగా కలిసి నటించారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు చాలా వ‌ర‌కు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో దాదాపుగా 25 సినిమాలు వచ్చాయి. వాటిల్లో 90 శాతం బ్లాక్ బస్టర్ హిట్స్,యు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. విజయశాంతికి లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా సూపర్ స్టార్ స్టేటస్ వచ్చాక కూడా చిరంజీవితో గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు చేసింది.

చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన సినిమాలు ఇవే.. | megastar chiranjeevi  lady amitabh vijayashanti hit pair in tollywood these are the films list–  News18 Telugu

ఈ సినిమాలో చిరుతో స‌మానంగా రెమ్యూనరేషన్ తీసుకుందని అప్పట్లో ఓ టాక్ ఎంతో వైర‌ల్‌గా మ‌రింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె చిరంజీవితో కలిసి నటించలేదు.1990వ దశకంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ సినిమాతో విజయశాంతి ప్రేక్షకులు ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ స్టార్ హీరోల రేంజ్‌కు వెళ్లిపోయింది. అలా వరుస‌ సినిమాలు చేస్తున్న సమయంలోనే తన కెరీర్ సైతం త్యాగం చేసి మ‌రీ రాజకీయాల్లోకి వెళ్ళింది.

చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన సినిమాలు ఇవే.. | megastar chiranjeevi  lady amitabh vijayashanti hit pair in tollywood these are the films list–  News18 Telugu

అలా రాజకీయాల్లో తన కెరీర్‌ మొదలుపెట్టిన విజయశాంతి రాజకీయంగా ఎదుగుతూ ఓ సారి ఎంపీగా కూడా గెలిచారు. అదే సమయంలో విజయశాంతి తన మనసులో ఒకటి ఉంచుకొని, బయటికి ఒకటి మాట్లాడే రకం కాదు.. మనసులో ఏది ఉన్నా నిర్మొహమాటంగా బయటికి చెప్పే గుణం ఆమె సొంతం. ఇదే స‌మ‌యంలో గ‌తంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె చిరంజీవి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో ఆ వ్యాఖ్యలు సోష‌ల్‌ మీడియాలో ఒక రేంజ్ వైర‌ల్‌గా మారాయి.

Sunday Ananura Video Song || Gang Leader Telugu | Chiranjeevi, Vijayashanti  - YouTube

గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రజలు సినీ పరిశ్రమకి ఎంతో ఇచ్చారు, కానీ సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు తెలంగాణకి అంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరైనా మాట్లాడారా ? చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, తెలంగాణ ప్రజల కోసం ఏం పోరాటం చేసాడు.. అందరూ ముసుగు దొంగలే, ఎవరికీ ధైర్యం లేదు’ అంటూ విజయశాంతి చేసిన కామెంట్స్ అప్పట్లో ఎంతో వైరల్ గా మారాయి.

ఆ రీజన్ వల్లే చిరంజీవి విజయశాంతితో ఎక్కువ సినిమాలు చేశారా | Actress  Vijayashanti Make More Films With Megastar Chiranjeevi Details,  Chiranjeevi, Interesting Facts, More Films, Vijayashanti, Mechanic ...

ఆ తర్వాత చిరంజీవి రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకొని వరుస‌ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. విజయశాంతి కూడా ప్రస్తుతం తెలంగాణ బిజెపిలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే స‌ర్కారువారి పాట ప్రి రీలీజ్ ఈవెంట్లో చిరు, విజ‌య‌శాంతి ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ఎంతో అప్యాయంగా మాట్లాడుకున్నారు.