‘అన్నమయ్య’ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామిగా సుమన్ కాకుండా ముంద‌నుకున్న హీరోలు వీళ్లే…!

అక్కినేని నాగార్జున కెరీర్‏లో సూపర్ హిట్ అయిన సినిమాలో అన్నమయ్య కూడా ఒకటి. 1997లో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి ప్రధాన పాత్రల‌లో న‌టించారు.. మోహన్ బాబు, రోజా, సుమన్, భానుప్రియ, శ్రీకన్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాస్ రావు కీలకపాత్రలలో కనిపించారు. ఈ సినిమకి కీరవాణి సంగీతం అందించారు.

Annamayya Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes

15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అన్నమయ్య పాత్రలో నాగార్జున జీవించేశారు. అలాగే వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ ఆ శ్రీవారినే మైమరపించేలా జీవించేశారు. ఇప్పటికీ ఈ సినిమా సినీ ప్రియులకు ఎవర్ గ్రీన్. వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఈ సినిమా విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి చోటు చేసుకుంది. అదేంటంటే.. ‘అన్నమయ్య’సినిమా అనుకున్న‌ప్పుడు భ‌క్తుడిగా టైటిల్ పాత్రలో నాగార్జున న‌టిస్తాడు స‌రే..! మ‌రి ఏడుకొండల స్వామి..వెంక‌టేశ్వ‌ర‌స్వామిగా ఎవ‌రు న‌టిస్తారు ? అనే సందేహం వ‌చ్చింది. సినిమాలో కొన్ని స‌న్నివేశాల్లో భ‌క్తుడైనా నాగార్జున.. వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌ధారి పాదాల‌పై ప‌డాల్సిన స‌న్నివేశాలున్నాయి.

Nandamuri Balakrishna added a new... - Nandamuri Balakrishna

అక్కినేని అభిమానుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా మంచి స్ట్రేచ‌ర్ ఉన్న ఆర్టిస్టుని వెంక‌టేశ్వ‌రునిగా న‌టింప చేస్తే బావుంటుంద‌ని భావించిన ద‌ర్శ‌కేంద్రుడు ముందుగా సీనియ‌ర్ న‌టుడు శోభ‌న్‌బాబుని క‌లిశారు. అయితే అప్ప‌టికే శోభ‌న్‌బాబు సినిమాల నుంచి రిటైర్ అయిపోయారు. అయితే అన్న‌మ‌య్య‌గా చేస్తుంది నాగేశ్వ‌ర‌రావు కొడుకు.. మ‌రోవైపు ద‌ర్శ‌కేంద్రుడు ఎలా చేయాలా? అని ఆలోచించిన శోభ‌న్‌బాబు రూ. 50 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తే చేస్తాన‌ని చెప్పారట.

ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అడిగితే వెన‌క్కి వెళ్లిపోతార‌నేది శోభ‌న్‌బాబు ఆలోచన‌. అప్ప‌ట్లో రూ. 50 ల‌క్ష‌ల పారితోషకం అంటే ఎక్కువే మ‌రి దీంతో ద‌ర్శక నిర్మాత‌లు శోభ‌న్‌బాబుని వ‌ద్ద‌నుకున్నారు. త‌ర్వాత రాఘ‌వేంద్రరావు బాల‌కృష్ణ‌ను వెంక‌టేశ్వ‌ర స్వామిగా న‌టింప‌చేస్తే ఎలా ఉంటుందా? అని కూడా ఆలోచించారట‌. ఆయనతో సంప్రదింపులు కూడా జరిపారట. ఎక్క‌డ ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు అవుతాయేమోన‌ని భావించి వ‌ద్ద‌నుకున్నారు.

Sobhan Babu Assets: చనిపోయేనాటికి శోభన్ బాబుకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో  తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. | Sobhan Babu Assets Vetern Tollywood Star  Hero Sobhan Babu properties and ...

ఇక చివరకు వెంకటేశ్వర స్వామి పాత్రకు సుమన్ బాగుంటుందని భావించిన రాఘవేంద్రరావు… ఆయనను కలిసి కథ వినిపించడంతో సుమన్ వెంటనే ఓకే చేశారట. అలా ఈ అద్భుతమైన అవకాశం సుమన్ సొంతం చేసుకున్నారు. అన్నమయ్య చిత్రంలో నాగార్జున, సుమన్ కాకుండా ఇతర ముఖ్యపాత్రల్లో ఈ సినిమాలో కీరవాణి 20 పాటలతో పాటు 20 ట్రాక్ పాటలు ఉన్నాయి. మొత్తంగా అన్నమయ్య సినిమా టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. ఒక రకంగా హీరోగా సుమన్ ఈ సినిమ‌తో తెలుగు ప్రేక్షకులకు దేవుడయ్యారు.