బిగ్ ట్విస్ట్: ప‌రిటాల శ్రీరామ్ సీటు మారుతోంది…!

[6:36 am, 16/03/2023] Subash Annaya: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..అదేంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు..ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడం ఏంటి? అని అనుకోవచ్చు..ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా..ఎన్నికల సమయంలో అంటే జంపింగులు ఉంటాయి..మరి ఇప్పుడే జంపింగులు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి. అధికార వైసీపీపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్తితి. నియోజకవర్గాల్లో పెద్దగా అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం..ఎంతసేపు బటన్ నొక్కి పథకాలకు డబ్బులు ఇవ్వడం తప్ప..పన్నుల భారం తగ్గించడం గాని, అభివృద్ధి చేయడం గాని లేదు.

AP News: పరిటాల శ్రీరామ్‌ను కలిస్తే ఫినిష్ చేస్తా..సీఐ అరాచకం | Paritala  sriram tdp Activists Dharmavaram ci Raja andhrapradesh suchi

దీనిపై పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. ఆ అసంతృప్తిని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ బయటపెట్టేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..ఈ ఇద్దరు వైసీపీపై విమర్శలు చేసి బయటకొచ్చేశారు. ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా మారిపోయారు. వీరు టి‌డి‌పిలో చేరడానికి రెడీ అవుతున్నారు.

అయితే వీరే కాదు..ఇంకా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తాజాగా టి‌డి‌పి సీనియర్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప బాంబు పేల్చారు. ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడానికి 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. 6 స్థానాలని వైసీపీ సులువుగా గెలుచుకోగలదు. కానీ 7వ స్థానం కోసం టి‌డి‌పితో పోటీ పడాల్సి ఉంది.

Case Registered Against Paritala Sunitha, SriRam: Raptadu Police - Sakshi

ఇప్పటికే టి‌డి‌పి తరుపున పంచుమర్తి అనురాధ బరిలో ఉన్నారు. ఇక టి‌డి‌పికి 23 మంది సభ్యుల బలం ఉంది..కానీ అందులో నలుగురు వైసీపీ వైపుకు వెళ్లారు. వారు అటు వెళ్ళిన వైసీపీ నుంచి తమకు మద్ధతు ఇచ్చే ఎమ్మెల్యేలు ఉన్నారని రాజప్ప చెప్పుకొచ్చారు. ఎలాగో కోటంరెడ్డి, ఆనం కనిపిస్తున్నారు..మరి వారు కాకుండా ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పితో టచ్ లో ఉన్నారని అంటున్నారు. మరి వైసీపీకి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు షాక్ ఇస్తారో చూడాలి.
బిగ్ ట్విస్ట్: ప‌రిటాల శ్రీరామ్ సీటు మారుతోంది…!

నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి యువనేత పరిటాల శ్రీరామ్ ఏ సీటులో పోటీ చేస్తారు? అంటే చెప్పడానికి ఇంకా క్లారిటీ రాలేదనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆయన ధర్మవరం బాధ్యతలని చూసుకుంటున్నారు. అటు రాప్తాడు బాధ్యతలు పరిటాల సునీతమ్మ చూసుకుంటున్నారు. అంటే సునీతమ్మ రాప్తాడులో, శ్రీరామ్ ధర్మవరంలో పోటీ చేస్తారని పరిటాల అనుచరులు ప్రచారం చేస్తున్నారు. అయితే అలా పోటీ చేసే ఛాన్స్ ఉందనేది ఇంకా క్లారిటీ లేదు.

Paritala Sunitha warns of stern action

 

నిజానికి గత ఎన్నికల్లో శ్రీరామ్ ఒక్కరే బరిలో దిగారు. సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని తన వారసుడుగా శ్రీరామ్‌ని రాప్తాడు బరిలో నిలిపారు. కానీ వైసీపీ వేవ్ లో శ్రీరామ్ ఓడిపోయారు. ఇదే సమయంలో ధర్మవరంలో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి బి‌జే‌పిలోకి వెళ్లారు. దీంతో చంద్రబాబు పరిటాల ఫ్యామిలీకి రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు అప్పగించారు. అలా రెండు స్థానాలు చూసుకుంటున్నారు. ఇక ఏ నాయకుడు మళ్ళీ టి‌డి‌పిలోకి వచ్చిన రెండు స్థానాలు తమవే అని శ్రీరామ్ చెబుతున్నారు.

అంటే రెండు స్థానాలు పరిటాల ఫ్యామిలీ చేతిలోనే ఉన్నాయి. కానీ ఇటీవల వచ్చిన ఒక ట్విస్ట్ ఏంటంటే..ఒక సర్వేలో రెండు స్థానాల్లో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది. శ్రీ ఆత్మసాక్షి సర్వేలో రాప్తాడు, ధర్మవరం సీట్లలో వైసీపీ గెలుస్తుందని తేలింది. దీంతో పరిటాల ఫ్యామిలీకి షాక్ తగలనుందా అని డౌట్ వస్తుంది. అయితే ధర్మవరం కంటే రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి కాస్త పాజిటివ్ ఎక్కువ ఉందని తెలుస్తోంది.

TDP youth leader Paritala Sriram tests positive for coronavirus asks  followers to undergo tests

ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నారు..కాబట్టి ధర్మవరం కంటే రాప్తాడు బరిలో ఉంటే శ్రీరామ్‌కు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. యువనేత కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. అందుకే ధర్మవరం సీటు వేరే వాళ్ళకు కేటాయించినా లేక అక్కడ సునీతమ్మ పోటీ చేసినా..రాప్తాడులో శ్రీరామ్ పోటీ చేస్తే బెటర్ అని పరిటాల అనుచరులు భావిస్తున్నారట. చూడాలి మరి శ్రీరామ్ సీటు మార్చుకుంటారో లేదో.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, paritala sriram, social media, social media post, telugu news, trendy news, YS Jagan, ysrcp