రావ‌ణాసుర ర‌వితేజ పెద్ద రాడ్ దింపేశాడు… రాడ్‌నాసురా..!

ధమాకా – వాల్తేరు విరయాలాంటి రెండు సూపర్ డూపర్ హిట్టులతో ఫామ్ లో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ ఈరోజు రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిని రేకెత్తించింది. దీనికి తోడు రవితేజ వరుసగా సూపర్ హిట్ సినిమాలతో ఫామ్ లో ఉండడంతో రావణాసురకు రిలీజ్ ముందే మంచి హైప్‌ కూడా వచ్చింది. ఈ సినిమా కథ అయితే ఆసక్తిగానే ఉంటుంది. క్రిమినల్ లాయర్ కనకమహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా ) దగ్గర రవీంద్ర ( రవితేజ ) జూనియర్ లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే వీరి దగ్గరకు హారిక ( మేఘ ఆకాష్ ) వచ్చి తన తండ్రి కేసు టేకప్ చేయమని అడుగుతుంది. సదరు వ్యక్తి ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవోగా ఉంటాడు. అతడు ఒక వ్యక్తిని మర్డర్ చేసినట్టు సాక్షాలు వీడియోలతో సహా ఉంటాయి. అయితే అతడు మాత్రం అసలు తనకు ఈ మర్డర్ కు ఏ మాత్రం ? సంబంధం లేదని.. మర్డర్ జరిగిన రోజు రాత్రి తనకు ఏం జరిగిందో ? గుర్తు లేదని ( సంపత్ రాజు ) చెబుతాడు.

అయితే నగరంలో ఇలాంటివే కొన్ని మర్డర్లు జరుగుతూ ఉంటాయి. మరోవైపు హారికను రేప్ చేసి మర్డర్ చేస్తారు. అసలు ఈ వరుస హత్య‌ల వెనక ఎవరు ఉన్నారు ? పోలీసులు సాకేత్ ( సుశాంత్ ) దగ్గరకు ఎందుకు ? వెళ్లారు. ఈ కేసు విచారణలో తేలిన ఆసక్తికర విషయాలు ఏంటన్నదే ? ఈ సినిమా స్టోరీ. కథ పరంగా చెబితే చాలా బాగున్నట్టు ఉంటుంది. సినిమా ప్రారంభం కూడా ఆసక్తిగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అయితే ఎవరు మర్డర్ చేస్తున్నారు ? అనేది తెలిసిన తర్వాత సినిమా రొటీన్ లైన్లోకి వెళ్లిపోతుంది.

Makers of Ravi Teja's 'Ravanasura' release Sushanth's look on his b'day |  Telugu Movie News - Times of India

సినిమాలో ఎక్కడ లాజిక్స్ లేవు ? అసలు ఇంటర్వెల్ తర్వాత మేజర్ ట్విస్ట్ రివిల్ చేస్తుంటే ఇప్పటికే ఇలాంటి సీన్లు తెలుగు సినిమాలో లెక్కకు మిక్కిలిగా చూసేసినట్టే కనిపిస్తాయి. పరమ రొటీన్ కథ‌, కథనం సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అయితే రవితేజ యాక్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మ‌నోడి యాటిట్యూడ్ కొత్తగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం రవితేజకు నూటికి నూరు మార్కులు వేయాలి. ఏదేమైనా మాంచి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చూస్తున్నామ‌నే ఫీలింగ్‌తో కాసేప‌టికే రొటీన్ క‌థ‌, రొటీన్ క్లైమాక్స్ తో రావ‌ణాసుర కాస్తా రాడ్‌నాసుర అయిపోయింది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, ravanasura movie, Ravi Teja, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news