టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్య కెరీర్ గత కొంత కాలంగా అంత ఆశాజనకంగా లేదు. ఆ మాటకు వస్తే చైతు మాత్రమే కాదు.. అక్కినేని హీరోలు నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. గతేడాది థ్యాంక్యూ, లాల్‌సింగ్ చద్దా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా నిరాశ పరిచిన నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
కస్టడీ సినిమాకు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్టర్. ఈ కస్టడీ కాప్ యాక్షన్ డ్రామాగా థియేటర్ల లోకి వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైలర్ బయటకు వచ్చాక భారీ అంచనాలే ఉన్నాయి. చైతుకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బంగార్రాజు సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఆ మ్యాజిక్ కస్టడీ సినిమాతో మరోసారి రిపీట్ అవుతుందనే అంటున్నారు.
ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. కస్టడీ సినిమా రన్ టైం 147 నిమిషాలు (2 గంటల 27 నిమిషాలు) కలిగి ఉంది. సినిమా జానర్ ను బట్టి చూస్తే ఇది పర్‌ఫెక్ట్ రన్ టైం అంటున్నారు. ఇక సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
కస్టడీకి మాస్ట్రో ఇళయరాజా – యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఇక సినిమా స్టార్టింగ్ 20 నిమిషాలు చాలా ప్లెజెంట్‌గా స్టార్ట్ అవుతుందని.. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు సెకండాఫ్‌లో గూస్‌బంప్స్ మోత మోగిపోయేలా ఉందని అంటున్నారు. క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్స్ అదిరిపోయాయట. ఓవరాల్‌గా కస్టడీకి మంచి టాక్ అయితే వస్తోంది.