సునీల్ తో నాగ చైతన్యకు అంత పెద్ద గొడవ జరిగిందా..? సివియర్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..?

అక్కినేని నాగచైతన్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగార్జున నటి వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య కమెడియన్ సునీల్ తో కలిసి తడాఖా అనే మల్టీస్టారర్ లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో నాగచైతన్య మెయిన్ హీరో కాగా నాగచైతన్యకు అన్నయ్యగా ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో సునీల్ ని తీసుకోవచ్చు అనే ఆలోచన తట్టిందట డైరెక్టర్ డాలికి..!

TeluguCinema365: Thadaka Movie Latest Wallpapers : Exclusive

ఆ విషయాన్ని నాగచైతన్యకు చెప్పగా నాగచైతన్య కాస్త ఈగో చూపించాడట. సునీల్ పక్కన నేను చేయడమేంటి అతను నాతో సాటిగా నటించే హీరోనా..! సునీల్ నటిస్తే నేను ఈ సినిమాలో నటించ‌ను అని సునీల్ తో గొడవ ప‌డి చైతు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఈ విషయం తెలిసిన నాగార్జున చైతుని పిలిచి సునీల్ తో నువ్వు సినిమా చేయకపోవడానికి ఒక సరైన కారణం చెప్పు.. అతను నీతో సినిమా చేయడానికి అన్నివిధాలా సరిపోతాడు.. సునీల్ హీరోగా న‌టించిన‌ సినిమాకు రు. 30 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి.. అలాంటి సినిమా నీకు ఒకటైనా ఉందా.. అని ప్రశ్నించాడట నాగార్జున.

Naga Chaitanya, Sunil starrer Thadaka | 123telugu.com

ఇగోతో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అంటూ గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున సునీల్ ను ఇంటికి పిలిచి నాగచైతన్య‌తో సారీ చెప్పించాడట. ఆ తరువాత చైతు, సునీల్ తో కలిసి తడాఖా సినిమాలో నటించారు. ఈ సినిమా నాగచైతన్య, సునీల్ ఇద్దరికీ మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఇటీవ‌ల్ల‌ కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్ట‌డి సినిమాలో హీరోగా నటించాడు నాగచైతన్య. ఈ సినిమా ఈ రోజే తెరపైకి వచ్చింది.