రెమ్యున‌రేష‌న్లో హీరోల‌కే చుక్కలు చూపించేస్తోన్న స్టార్ హీరోయిన్లు… ఎవ‌రికి ఎంతంటే…!

సినీ ఇండస్ట్రీ లోకి పెట్టి స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత కూడా తమ క్రేజ్ ఏమాత్రం తగకుండా ఇంకా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు చాలామంది స్టార్ హీరోయిన్స్. ఇటీవల సోషల్ మీడియా ద్వారా స్టార్స్ యొక్క పర్సనల్ విషయాలతో పాటు వారి హాట్ ఫోటోషూట్స్ ఇంకా వారి ఏ విష‌యం అయినా నెట్టింట‌ బాగా వైరల్ అవుతుండడంతో వారి వారు తీసుకునే రెమ్యున‌రేషన్ ఎంత ఉంటుంది అనే అంశంపై కూడా ఫాన్స్ లో ఆసక్తి ఎక్కువగానే ఉంది. అయితే రెమ్యూన‌రేషన్ తీసుకునే విషయంలో స్టార్ హీరోల‌కే చుక్కలు చూపిస్తున్నారు కొంతమంది స్టార్ హీరోయిన్లు… ఎవరి రెమ్యూన‌రేషన్ ఎంతో తెలుసుకుందామ.

Alia Bhatt named Gucci's first Indian Global Ambassador, will make first appearance at Gucci Cruise 2024 show in Seoul | Fashion Trends - Hindustan Times

దీపికా పదుకొనే:
అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో మొదటిగా దీపిక పదుకొనే పేరే వినిపిస్తుంది. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా దీపికా రికార్డులు ఎక్కింది. ఈమె ఒక్క సినిమాకు రు. 15 నుండి రు. 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంద‌ట‌. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాలు దీపిక కథానాయకగా నటిస్తున విష‌యం అందరికీ తెలిసిందే. ఈ సినిమా దీపికకు టాలీవుడ్ లో మొదటి సినిమా అని చెప్పాలి. ఈ సినిమాకు దాదాపు రు. 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందట దీపిక.

కంగనా రనౌత్:
ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఇప్పటి వరకు నాలుగు సార్లు జాతీయ అవార్డు దక్కించుకున్న కంగనా.. ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వంతో బాలీవుడ్ లో శత్రువులను పెంచుకుంది అని చెప్పాలి. అయితే ఇటీవల పురుషుల కంటే మేము ఇందులో ను తక్కువ కాదు అనే నినాదంతో ఆమె చేస్తున్న పోరాటం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అయితే కంగనా తన నటించే ఒక్క సినిమాకు రు. 15 నుంచి రు. 20 కోట్ల మధ్యలో పారితోషకాన్ని తీసుకుంటుందట.

kareena kapoor blue lehenga for Sale OFF 69%

ప్రియాంక చోప్రా :
బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ల‌లో తనదైన ముద్ర వేసుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తనకున్న క్రేజ్ ని క్యాష్ గా మార్చుకుంటుంది ప్రియాంక. నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని ఒక ఇంటి కోడలు అయిన తర్వాత కూడా సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గకుండా తన కెరియర్ ను ఫామ్ లో ఉంచుకుంది ప్రియాంక. అయితే ఈమె ఒక్కొక్క సినిమాకు రు. 14 నుంచి రు. 23 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

కత్రినా కైఫ్ :
కత్రినాకు ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వ‌చ్చి దాదాపు రెండు దశాబ్దాలు దాటుతున్నప్పటికీ ఆమె స్టార్ వాల్యూ ఇప్పటికి తగ్గకుండా అలాగే కొనసాగిస్తుంది. అయితే కత్రినా తన ఒక్క సినిమాకు రు. 15 నుంచిరు. 21 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట.

Happy birthday Vidya Balan, the star who has defined success on her own terms in a male-centric Bollywood | Entertainment News,The Indian Express

అలియా భట్:
గత ఏడాది వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలైనా బ్రహ్మాస్త్ర, ఆర్ఆర్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆలియా భట్ కు ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఒకే ఏడాదిలో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా.. గంగుబాయి కథియా వాడి అనే సినిమా ద్వారా వేశ్య‌ పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది ఆలియా. ఆమె ఒక్కో సినిమాకు రు. 10 నుంచి రు. 25 కోట్లు పుచ్చుకుంటుందట.

కరీనా కపూర్:
ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కరీనాకపూర్ ఇప్పటికి తన ఫిజిక్ చక్కగా మెయింటైన్ చేస్తూ సినిమా అవకాశాలను దక్కించుకుంటూనే ఉంది. 42 ఏళ్ళు వచ్చినా ఈ ముద్దుగుమ ప్రస్తుతం కుటుంబ భారాన్ని మోస్తున్న కరీనా కొన్ని సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ నటిస్తుంది. అయితే ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రు. 8 నుంచి రు. 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట.

Janhvi Kapoor says she gets a lot of opportunities: 'Izzat abhi tak nahi mili' | Entertainment News,The Indian Express

విద్యా బాలన్:
చూడడానికి ట్రెడిషనల్ గా ఉండే విద్యాబాలన్ కమర్షియల్ సినిమాల్లో ఏ మాత్రం తగ్గకుండా నటిస్తుంది. ది డర్టీ పిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన ఈమె ఎన్టీఆర్ బయోపిక్ లోను ప్రముఖ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కహాని సినిమాలో నటనకు ఈమెకు చాలా అవార్డులే వచ్చాయి. ఇటీవల పద్మశ్రీ అవార్డును అందుకున్న విద్యాబాలన్ తన ఒక్కొక్క సినిమాకు దాదాపు రు. 8 నుంచి రు. 14 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటుందట.

ఇక బాలీవుడ్ యువ నాయకులను జాహ్నవి కపూర్, అనన్య పాండే సుమారు రు. 3 నుంచి రు. 4 కోట్లకు పైగా పారితోషకాన్ని అందుకుంటున్నారని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ విషయానికి వస్తే నయనతార రు. 6 నుంచి రు. 8 కోట్లు, కాజల్, సమంత రు. 3 నుంచి రు. 4 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారని తెలుస్తుంది.

Nayanthara To Samantha Ruth And Kajal Aggarwal: South Divas Most Loved In Bollywood | IWMBuzz