“మళ్ళీ పెళ్లి” వెనుక ఉన్న అసలు సీక్రేట్ ఇదే..? నరేష్ ప్లానింగ్ మాములుగా లేదుగా..!!

నరేష్ – పవిత్ర లోకేష్ ఇటీవల కాలంలో ఈ పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 2023 కొత్త సంవత్సరం రోజు నరేష్ – పవిత్ర లోకేష్ కు లిప్ లాక్ ఇస్తూ దిగిన ఫోటో నరేష్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొన్ని పర్సనల్ కారణాల చేత నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి కి దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. చాలాకాలంగా నరేష్ – పవిత్ర లోకేష్ లు ఇద్దరు సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉంటారంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

Pavitra Lokesh to star opposite Naresh in 'Malli Pelli', first look poster

తొందరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వచ్చిన వార్తలను నిజం చేస్తూ వాళ్లు 11 మార్చ్ 2023న వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ వీరిద్దరి ప్రేమను గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపడంతో.. మళ్లీ పెళ్లి అనే సినిమాతో నరేష్ – పవిత్ర లోకేష్ జంటగా వారిద్దరి నిజ జీవితంలో జరిగిన కథను సినిమా రూపంలో తెరకెక్కించబోతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ప్రేక్షకుల ఆసక్తిని క్యాష్ చేసుకోవడం కోసం మళ్లీ పెళ్లి అనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ఈ సినిమా పైన ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ చిత్రంలో పవిత్ర లోకేష్ అలాగే నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి కి మధ్యన జరిగిన సంఘటనలను కొంచెం బోల్డ్ గా చూపించార‌ని తెలుస్తుంది. ఈ సినిమా మే 26న రిలీజ్ అవుతుండడంతో మూవీ మేకర్స్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. కాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ – పవిత్ర మీడియా అడిగిన ప్రశ్నలకు గమ్మత్తైన సమాధానాలు చెప్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

VK Naresh Opens About When And Where He Met His To-Be Wife Pavitra Lokesh - Filmibeat

నరేష్ ని ఒక విలేకరి మూడో భార్యపై రివెంజ్ తీసుకోవడానికి ఈ చిత్రం తెరకెక్కించారా ? అని అడిగిన ప్రశ్నకు నరేష్ గమ్మత్తుగా సమాధానం చెప్పాడు. రివెంజ్ తీసుకోవాలంటే కత్తితో చంపేయడం లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ‌డ‌మో చేస్తారు గాని.. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తారా అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఇక పవిత్ర లోకేష్ తో పెళ్లి గురించి కూడా నరేష్ సమాధానం ఇచ్చాడు. పెళ్లి వ్యవస్థ పై నాకు గౌరవం ఉంది. ప్రస్తుతం ఆ పెళ్లి వ్యవస్థ కుప్పకూలిపోయింద‌న్నాడు.

Tollywood actor Naresh to wed Pavitra Lokesh; it's his 4th marriage

నా దృష్టిలో పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం మాత్రమే ఆ రకంగా చూసుకుంటే పవిత్ర కి నాకు పెళ్లి అయిందో లేదో మీరే నిర్ణయించుకోండి అని నరేష్ అన్నాడు. పవిత్ర మాట్లాడుతూ మాకు కృష్ణ అంకుల్, విజయనిర్మల ఆంటీల బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి అని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ప్రస్తుతం గొడవల కారణంగా మూడో భార్య రమ్యా రఘుపతితో దూరంగా ఉంటున్నాడు నరేష్. అయితే వీరిద్దరికీ విడాకులు అఫీషియల్ గా రాకపోవడంతో నరేష్ కి పవిత్ర కి మధ్యన పెళ్లి జరిగినా అది చెల్లదు దాంతో వారిద్దరూ ప్రస్తుతం ఓపెన్ రిలేషన్షిప్ లోనే ఉంటున్నారు.