పేర్ని నాని వార‌సుడిపై ‘ కొల్లు ‘ మార్క్ రివేంజ్‌… బంద‌రులో వైసీపీకి భారీ షాక్‌..!

గత ఎన్నికల్లో దారుణ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని చాలామంది టి‌డి‌పి నేతలు కసితో ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని చూస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్, వైసీపీ ప్రచారాలకు టి‌డి‌పి నేతలు చాలామంది ఓటమిబాటపట్టారు. అలాగే ఓడిపోయాక చాలామంది టి‌డి‌పి నేతలకు వైసీపీ అధికార బలంతో చుక్కలు చూపిస్తూ వచ్చింది.

అలా వైసీపీ రాజకీయం వల్ల పలువురు టి‌డి‌పి నేతలు ఇబ్బందులకు గురయ్యారు. అలా ఇబ్బందులకు గురైన వారు ఇప్పుడు కసితో రగులుతున్నారు. ఎలాగైనా వైసీపీని ఓడించాలని చూస్తున్నారు. అలా రివెంజ్ కోసం ఎదురుచూస్తున్న నేతల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఒకరు. గత ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో కొల్లు ఓడిపోయారు. ఓడిపోయిన కొల్లుకు వైసీపీ చాలాసార్లు ఇబ్బందులకు గురి చేసింది. పలుమార్లు ఆయన జైలుకు కూడా వెళ్లారు.

అయినా సరే కొల్లు వెనక్కి తగ్గకుండా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ…మచిలీపట్నంలో పార్టీ బలాన్ని పెంచుతూ వస్తున్నారు. ఇప్పటికే బందరులో టి‌డి‌పికి బలం పెరిగిందని ఇటీవల సర్వేల్లో తేలింది. ఈ సారి కొల్లు..వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన వారసుడు పోటీ చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

ఇదే క్రమంలో పేర్ని వారసుడు బందరు రాజకీయాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు..ఆయనే ప్రజల్లో తిరుగుతున్నారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో కొల్లు..పేర్ని వారసుడుతో తలపడబోతున్నారు. అయితే ఈ పోరు లో కొల్లు పై చేయి సాధించేలా ఉన్నారు. ఇప్పటికే కొల్లుకు పాజిటివ్ ఉంది. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే కాపు ఓట్లు కూడా కొల్లుకు కలిసొస్తాయి..అప్పుడు సులువురుగా వైసీపీని ఓడించవచ్చు. కొల్లుకు సానుభూతి ప‌వ‌నాలు, జ‌న‌సేన పొత్తు ఉంటే బంద‌రులో వైసీపీకి భారీ షాక్ త‌ప్ప‌దు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp