ఆ వైసీపీ ఎమ్మెల్యేకు ‘ క‌న్నా ‘ దెబ్బ గ‌ట్టిగా త‌గిలిందా…!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న స్థానాల్లో గుంటూరు వెస్ట్ ఒకటి..ఈ స్థానంలో టి‌డి‌పికి బలం ఎక్కువ. పూర్తిగా గుంటూరు నగర పరిధిలో ఉండే ఈ స్థానంలో గత రెండు ఎన్నికల నుంచి టి‌డి‌పి గెలుస్తూ వస్తుంది. అయితే రెండుసార్లు టి‌డి‌పి నుంచి గెలిచిన వారు వైసీపీలోకి జంప్ చేశారు. 2014లో గుంటూరు వెస్ట్ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలిచారు..అయితే గత ఎన్నికల ముందు ఆయన టి‌డి‌పికి షాక్ ఇచ్చి..వైసీపీలోకి వెళ్లిపోయారు.

దీంతో 2019 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి మద్దాలి గిరికి ఛాన్స్ ఇచ్చారు. ఇక ఎలాగో టి‌డి‌పి బలం ఉంది..జగన్ గాలిలో కూడా వెస్ట్ లో టి‌డి‌పి గెలిచింది. అయితే టి‌డి‌పి నుంచి గెలిచిన మద్దాలి గిరి ఎక్కువ కాలం పార్టీలో లేరు..వెంటనే ఆయన వైసీపీలోకి జంప్ చేశారు. ఆ పార్టీతోనే అంట‌కాగుతున్నారు. అలా వరుసగా టి‌డి‌పి నుంచి గెలిచిన వారు జంప్ చేశారు. గిరి వెళ్లిపోయాక వెస్ట్ ఇంచార్జ్ గా కోవెలమూడి రవీంద్రకు బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆయనకు నెక్స్ట్ సీటు ఇచ్చే విషయం డౌటే..పైగా ఈ సీటు కోసం టి‌డి‌పిలో పోటీ ఉంది.

ఎందుకంటే అమరావతి ప్రభావం వల్ల గుంటూరులో టి‌డి‌పి బలం పెరిగింది..అటు వైసీపీపై వ్యతిరేకత ఉంది. వైసీపీ నుంచి వెళ్ళిన మద్దాలిగిరికి పాజిటివ్ లేద‌నే స్థానికంగా టాక్ న‌డుస్తోంది. కాబట్టి గుంటూరు వెస్ట్ లో మద్దాలి గిరికి ఈ సారి పెద్ద దెబ్బపడేలా ఉంది. ఇక గిరికి చెక్ పెట్టేందుకు ఇక్కడ టి‌డి‌పి నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగుతారని తెలుస్తోంది.

ఇటీవలే ఆయన బి‌జే‌పి నుంచి టి‌డి‌పిలోకి వచ్చారు. ఇక గుంటూరు లో కన్నాకు కాస్త ఫాలోయింగ్ ఉంది. 2009లో ఈయన కాంగ్రెస్ నుంచి గుంటూరు వెస్ట్ లో గెలిచారు. కాబట్టి కన్నా గాని గుంటూరు వెస్ట్ లో పోటీ చేస్తే మద్దాలికి చెక్ పడే ఛాన్స్ ఉంది. పైగా టి‌డి‌పితో జనసేన పొత్తు ఉంటే డౌట్ లేకుండా మద్దాలి ఓటమి ఖాయమే అన్న చ‌ర్చ కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఏదేమైనా గిరికి క‌న్నా దెబ్బ అయితే చాలా గ‌ట్టిగానే ప‌డేలా ఉంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp