ఒకే రోజు సీఎం జ‌గ‌న్‌కు రెండు షాక్‌లు.. అవి ఇవే…!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఒకే రోజు రెండు విష‌యాల్లో బిగ్ షాట్‌లు త‌గ‌ల‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రిం చుకుంది. నిజానికి కొన్నాళ్లుగా జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాల‌కు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వ‌ర‌కు కూడా కొన్నికొన్ని విష‌యాల్లో సానుకూల నిర్ణ‌యాలు వ‌స్తున్నాయి. అయితే.. తాజాగా సీఎ జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ కంగా భావించిన జీవో 1 ని హైకోర్టు కొట్టివేసింది. దీనిపై పెద్ద ర‌గ‌డే చోటు చేసుకుంది. 1835 నాటి బ్రిటీష్ చ‌ట్టాల నుంచి తెచ్చిన ఆదేశాల‌ను పొందు ప‌రిచి ఈ జీవో చేశార‌ని విప‌క్షాలు ఆరోపించాయి.

YSR Congress MP Raghu Rama Krishna Raju invites central ministers, MPs over dinner in Delhi

ఇక‌, ఈ క్ర‌మంలోనే విప‌క్షాలు టీడీపీ స‌హా.. జ‌న‌సేన‌లు ఈ జీవోను తీవ్రంగా వ్య‌తిరేకించాయి. హైకోర్టుకు కూడా వెళ్లాయి. అయితే.. ఎట్ట‌కేల‌కు ఈ జీవోను హైకోర్టు కొట్టివేసింది. అయితే.. ఇక్క‌డ‌కు చర్చ‌కు వస్తు న్న విష‌యం ఏంటంటే.. జ‌గ‌న్ కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్నాన‌ని చెబుతున్న స‌మ‌యంలో విప‌క్షాల‌కు సానుకూలంగా ఈ తీర్పు ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌తిప‌క్షాలు పుంజుకునేందుకు అవ‌కాశం ఉంది.

ఇక‌, మ‌రో కీల‌క హైకోర్టు ఆదేశం కూడా.. జ‌గ‌న్‌కు ఎస‌రు పెడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అదే.. సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజుకు సంబంధించి సీఐడీ పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో కొట్టార‌న్న కేసు కూడాఇ ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఈ టార్చ‌ర్ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు.. ఆ స‌మ‌యంలో పోలీసు స్టేష‌న్ ప‌రిస‌రాల్లో ఉన్న‌వారి కి సంబంధించిన ఫోన్ కాల్ లిస్టును సేక‌రించాల‌ని ఆదేశించింది.

Andhra CM anguished over inhuman treatment of COVID victim's body

ఇది వైసీపీ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశం ఉందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వీరిలో అంబ‌టి రాంబాబు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా ఒకే రోజు హైకోర్టు ఇచ్చిన ఈ రెండు ఆదేశాలు కూడా జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర ప్ర‌భావం చూపించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రోవైపు.. బీజేపీ నాయ‌కుడిపై పోలీసులు బూటు కాళ్ల‌తో విరుచుకుప‌డ‌డం కూడా.. ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. మొత్తంగా చూస్తే.. వైసీపీకి ఎన్నిక‌ల ముంగిట అన్నీ ఇబ్బందులే ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు.