చిరంజీవి తల్లి అంజనాదేవికి బాగా ఇష్టమైన యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టముండని వారుండరు. ఆయన సినిమాలను ఇప్పటికీ ఆదరిస్తారు. అందుకే నేటి డైరెక్టర్లు విభిన్న కథలతో చిరంజీవితో సినిమాలు తీస్తున్నారు. ఈ సంక్రాంతికి యంగ్ డైరెక్ట‌ర్ చిరుతో వాల్తేరు వీర‌య్య లాంటి మాస్ సినిమా తెర‌కెక్కించి మ‌రీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టించాడు. మెగాస్టార్‌తో పాటు ఆయన ఫ్యామిలీలో నుంచి ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Chiranjeevi Mother Anjana Devi: చిరంజీవి గారి తల్లికి బాగా ఇష్టమైన హీరో  ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఎంత పెద్ద స్టార్లు అయినా చిరంజీవి అంటే వారికి ఎంతో అభిమానం. కానీ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి గారికి మ‌త్రం సొంత కుటుంబంలో ఉన్న హీరోల‌వే కాకుండా బయట హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోల సినిమాలను బాగా చూసేవారట. చిరంజీవి తరం హీరోలలో విక్టరీ వెంకటేష్ సినిమాలను ఇంట్లో ఉన్నా వాళ్ళందరూ చూసేవారట.

Mahesh Babu clears the air around controversial statement on Bollywood  offers, says he respects all languages

అంజనాదేవికి కూడా వెంకీ సినిమాలంటే బాగా ఇష్టం. ఇక ప్రస్తుతం యంగ్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలంటే అంజనా దేవికి ఎంతో ఇష్టమట. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు కాకుండా బయట హీరోలు అంటేనే మా అమ్మగారికి ఎక్కువ ఇష్టమని.. వారిలో మహేష్ బాబు సినిమాలంటే ఎంతో ఇష్టమని చెప్పారు.

Venkatesh Daggubati Biography: Movies, Photos, Videos, News, Biography &  Birthday