తమన్నాను న‌మ్ముకుని టాలీవుడ్‌లో ఎంత‌మంది స్టార్ హీరోలు మునిగిపోయారో తెలుసా..!

తెలుగులో దాదాపుగా 18 సంవత్సరాల పాటు కెరీర్‌ను కొనసాగించిన హీరోయిన్లు అతి తక్కువ మంది. ఆ హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు కాగా స్టార్ హీరోలతో తమన్నా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు విజ‌యం సాధించినా తమన్నా వల్ల ఆ సినిమాలు సక్సెస్ సాధించాయని ఎవరూ అనుకోరు. ఎక్కువమంది స్టార్ హీరోలకు తమన్నాతో కలిసి నటించిన వారికి షాకింగ్ ఫలితాలే వ‌చ్చాయి అనే కామెంట్లు కూడా ఉన్నాయి.

Oosaravelli telugu | Sun NXT

ప్ర‌జెంట్ ఇప్పుడు త‌మ‌న్నాకు ఆఫ‌ర్లు కూడా త‌గ్గాయి. మంచు మోనోజ్ హీరోగా వ‌చ్చిన శ్రీ సినిమాతో తెలుగులో కేరీర్‌ను మొద‌లు పెట్టింది. త‌మ‌న్నా మొద‌టి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన హ్య‌పీడేస్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత ఆమె వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. అల్లు అర్జున్ – తమన్నా కాంబినేషన్లో బద్రీనాథ్ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

Aagadu (2014) - IMDb

పవన్ తమన్నా కాంబోలో వ‌చ్చిన‌ కెమెరామేన్ గంగతో రాంబాబు కూడా తమన్నాకు పెద్ద‌ మైనస్ అయింది. తారక్- తమన్నాజంట‌గా న‌టించిన‌ ఊసరవెల్లి కూడా అంచనాలను అందుకోలేదు. చరణ్, తమన్నా కాంబో వ‌చ్చిన‌ రచ్చ హిట్ గా నిలిచినా ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ తమన్నాకు ద‌క్క‌లేదు. ప్రభాస్- తమన్నా కాంబోలో వ‌చ్చిన‌ రెబల్ డిజాస్ట‌ర్‌. మహేష్- తమన్నా కాంబోలో వ‌చ్చిన‌ ఆగడు మ‌రో డిజాస్ట‌ర్‌.

Cameraman Gangatho Rambabu - Wikipedia

బాహుబలి 1, బాహుబలి 2 సక్సెస్ సాధించినా ఆ సినిమాల సక్సెస్ కు ప్రభాస్, రాజమౌళి కారణం. కాగా ఈ సినిమాలకు తమన్నా ఏ విధంగా ప్లస్ కాలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు వ‌చ్చినా తమన్నా వాళ్ల‌కు ప్లాపులే ఇచ్చింది. ఆ సినిమాల‌న్నీ కూడా ఆ హీరోల కెరీర్ కు మైనస్ తమన్నా అయ్యాయి. సీనియర్ హీరోలతో తమన్నా నటించిన సినిమాలలో ఎఫ్2 మాత్రమే హిట్ గా నిలిచింది. ఎఫ్ 3 మ‌ళ్లీ బిలో యావ‌రేజ్‌. ప్రస్తుతం తమన్నా చిరంజీవితో భొళా శంకర్ సినిమా చేస్తుంది. దీనిమీదే ఆమె ఆశ‌లు ఉన్నాయి. అయితే గ‌తంలో చిరుతో చేసిన సైరా కూడా అంచ‌నాలు అందుకోలేదు.