అక్క‌డ జ‌న‌సేన‌తో వైసీపీకి చెక్ పెడుతోన్న చంద్ర‌బాబు.. ఏం మాస్ట‌ర్ ప్లాన్‌..!

విజయవాడ నగరం ఒకప్పుడు కమ్యూనిస్టులకు..ఇప్పుడు టీడీపీ కంచుకోట. నగరంలో ఉన్న సీట్లలో ఒకప్పుడు టి‌డి‌పి, కమ్యూనిస్టులు మంచి విజయాలు సాధించాయి. మధ్యలో కాంగ్రెస్ సైతం సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర విభజన తర్వాత నగరంలో టి‌డి‌పి హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్, సెంట్రల్ సీట్లని టి‌డి‌పి గెలుచుకుంది. ఇక విజయవాడ వెస్ట్ పొత్తులో భాగంగా బి‌జే‌పికి ఇవ్వడంతో అక్కడ బి‌జే‌పి ఓటమి పాలైంది. దీంతో వైసీపీ నుంచి జలీల్ ఖాన్ గెలిచారు.ఆ తర్వాత జలీల్ టి‌డి‌పిలోకి వచ్చేశారు. అలా నగరంపై టి‌డి‌పి పట్టు సాధించింది.

Prakasam Barrage - Wikipedia

ఇక 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ గాలి ఉన్నా సరే విజయవాడలో టి‌డి‌పి సత్తా చాటింది. విజయవాడ ఎంపీ సీటుతో పాటు విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ సీటు గెలుచుకుంది. కానీ 25 ఓట్ల తేడాతో విజయవాడ సెంట్రల్లో టి‌డి‌పి ఓడిపోయింది. అటు 7 వేల ఓట్ల తేడాతో విజయవాడ వెస్ట్ లో ఓడిపోయింది. అయితే వెస్ట్‌లో లోక్‌స‌భ‌కు వ‌చ్చేస‌రికి టీడీపీ ఎంపీ అభ్య‌ర్థి కేశినేని నానికి మెజార్టీ వ‌చ్చింది.

Yellow Media vs AP Top minister: What's happening in his 'Farmhouse'? -  TeluguBulletin.com

ఇక న‌గ‌రంలో ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ .. ఈ రెండు చోట్ల వైసీపీ గెలిచింది. అయితే ఈ రెండు చోట్ల సీన్ మారిపోతూ వస్తుంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే లేటెస్ట్ సర్వేల్లో ఈస్ట్, సెంట్రల్ లో టి‌డి‌పి గెలుపు ఖాయమని తేలింది. కాకపోతే వెస్ట్ లో కాస్త వైసీపీతో టి‌డి‌పికి పోటీ ఉంది. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే డౌట్ లేకుండా వెస్ట్ సీటు కూడా టి‌డి‌పినే గెలిచే ఛాన్స్ ఉంది. అటు విజయవాడ ఎంపీ సీటులో కూడా ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి.

Pawan Kalyan officially releases Jana Sena party symbol

కాకపోతే పొత్తు ఉంటే జనసేనకు విజయవాడ వెస్ట్ సీటు ఇవ్వాల్సి వస్తుందని తెలుస్తోంది. ఖచ్చితంగా పొత్తు ఉంటే ఆ సీటు కోసం జనసేన పట్టుబట్టడం ఖాయం. ఇటు టి‌డి‌పి కూడా జనసేనకే ఆ సీటు వదిలేయొచ్చు. ఇక జనసేనకు సీటు ఇస్తే..టి‌డి‌పి సపోర్ట్ తో వెస్ట్ సీటులో వైసీపీని ఓడించడం ఈజీ అని చెప్పవచ్చు. మొత్తానికి చాలా ఏళ్ళు తర్వాత విజయవాడ వెస్ట్ లో టి‌డి‌పి ప్రభావం చూపనుంది.

Tags: AP, ap politics, intresting news, janasena, janasena cheaf pawan, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, YS Jagan, ysrcp