ఆ డైరెక్ట‌ర్‌తో ప్రియ‌మ‌ణికి ఈ సీక్రెట్ రిలేష‌న్ ఉందా… ఆ పేరు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!

ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది ప్రియమణి. మొదటి సినిమా అంతగా హిట్ కాక పోయినప్పటికీ తర్వాత వచ్చిన జ‌గ‌ప‌తిబాబు హీరోగా మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. ఆ తర్వాత వరుస సూపర్ హిట్లతో దూసుకుపోయిన ప్రియమణి టాలీవుడ్ లోని చాలామంది అగ్ర హీరోలతో నటించింది.

Priyamani - Wikipedia

కమర్షియల్ సినిమాల్లో అందాల ఆరబోతలో ఏమాత్రం లిమిట్ పెట్టుకోకుండా నటించి ఈ హాట్ బ్యూటీ కుర్ర‌కారుని ఆక‌టుకుంది. ప్రియమణి తన కెరియర్ మంచి ఫామ్ లో ఉండగా చాలామంది కొత్త హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో ఆమె క్రేజ్ మెల్లమెల్లగా తగ్గిపోయింది. త‌ర్వాత‌ ముస్తాఫ్ రాజ్ అనే బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్ని రోజుల వరకు ఇండస్ట్రీలో బ్రేక్ తీసుకున్న ప్రియమణి మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బుల్లితెరపై డాన్స్ ప్రోగ్రాం జడ్జిగా వ్యవహరించింది.

Priyamani's First Look Poster Is Unveiled From Naga Chaitanya's Custody  Movie Ahead Of The Trailer Launch

 

ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొన్న‌ ప్రియమణి ప్రస్తుతం సినిమాలలో కూడా తనకు తగ్గ పాత్రను ఎంచుకుంటూ బిజి షెడ్యూల్ లో గడుపుతుంది. ఇటీవల ప్రియమణి సీఎంగా కస్టడీ సినిమాలో నటించింది. అయితే ప్రియ‌మ‌ణికి ఒక స్టార్ డైరెక్టర్‌తో ఉన్న సీక్రెట్ రిలేషన్ షిఫ్‌ ఇటీవల బయటపడింది. ఇంతకీ ఆ సీక్రెట్ రిలేషన్ షిప్ ఏంటి..? ఆ డైరెక్టర్ ఎవరు.. ? అనుకుంటున్నారా ఎవరో కాదు కస్టడీ సినిమా డైరెక్టర్ అయిన వెంకట్‌ ప్రభు.

Director Venkat Prabhu Reveals Inspiration Behind His Upcoming Film Custody

అయితే మీరు అనుకుంటున్న‌ట్టు అది వేరే రిలేషన్షిప్ ఏమి కాదు. వెంకట్‌ ప్రభు సోదరి ప్రియమణికి మంచి స్నేహితురాలట. దీంతో వెంకట్‌ ప్రభు కూడా ప్రియమణికి మంచి స్నేహితుడిగా మారాడట. దాంతో పాటే ప్రియమణి తమిళ్ సినిమాల్లో నటించేటప్పుడు వెంకట్‌ ప్రభుకి ప్రియమణికి మధ్య మంచి స్నేహం ఉండేదట.