నాగార్జున‌తో న‌టించిన ఈ హీరోయిన్ల‌కు ఇంత ఏజ్ గ్యాప్ ఉందా… షాక్ అవ్వాల్సిందేగా…!

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది.పది సంవత్సరాలు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగారు అంటే అదే గొప్ప విషయం. హీరోలు మాత్రం 60 ఏళ్ళు దాటిపోతున్న స్టార్ హీరోలు గానే కొనసాగుతూ ఉంటారు.ఈ క్రమం లోనే ఇండస్ట్రీలోకి వచ్చే యువ హీరోయిన్లు ఇలా వయసు మీద పడిన హీరోల సరసన నటించాల్సి ఉంటుంది.

Amazon.com: Boss - I love you : Nagarjuna, Nayanthara, Poonam Bhajwa, Shriya Saran, Brahmanandam, Sayaji Shinde, Sunil, V.N. Aditya, Ramana Chintapally, VN Aditya, D Siva Prasad Reddy: Prime Video

ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఇలా సీనియర్ హీరోగా కొనసాగుతున్నాడు నాగార్జున. చూస్తే అలా అనిపించకపోయినా వయసు ఎవరు దాచలేరు కదా.ఆయనకు 60 ఏళ్లు దాటిపోయాయి. ఇంకా కుర్ర హీరోయిన్ల సరసన నటిస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇక నాగార్జునకు ఆ యంగ్ హీరోయిన్‌ల‌ మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

నాగార్జున – న‌య‌న‌తార :
సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీగా ఉంటున్న నయనతార నాగార్జున సరసన బాస్ – గ్రీకువీరుడు సినిమాల‌లో నటించింది. వీరిద్దరి మధ్య కూడా 23 సంవత్సరాలు పైగా ఏజ్ గ్యాప్‌ ఉంది.

Aakanksha Singh on working with Nagarjuna in Devadas: Learnt a lot from him about dialogue delivery, comic timing-Entertainment News , Firstpost

నాగార్జున – లావ‌ణ్య త్రిపాఠి :
సోగ్గాడే చిన్నినాయన లాంటి సూపర్ హిట్ సినిమాలో నాగార్జునకు పర్ఫెక్ట్ జోడిగా లావణ్య త్రిపాఠి నటించింది. లావణ్య – నాగార్జున మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 32 సంవత్సరాలు ఉంది.

నాగార్జున – శ్రీయ‌ :
నేనున్నాను – మనం సినిమాల్లో నాగార్జున – శ్రేయ జోడిగా నటించారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 23 సంవత్సరాలు ఉండటం విశేషం.

Nagarjuna and Sonal Chauhan's The Ghost to Release on Netflix?

నాగార్జున – త్రిష :
నాగార్జున కెరీర్లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన కింగ్ సినిమాలో త్రిష హీరోయిన్‌గా చేసింది. వీరి మ‌ధ్య కూడా 24 సంవత్సరాల ఏజ్ గ్యాప్‌ ఉంది.

నాగార్జున – ఆకాంక్ష సింగ్‌:
దేవదాసు సినిమాలో నాగార్జునకి జోడిగా నటించింది ఆకాంక్ష సింగ్. వీరి మధ్య కూడా 32 సంవత్సరాల గ్యాప్ ఉంది.

Anusha Nagarjuna | Nagarjuna Next Movie | Anushka Shetty | Nagarjuna Karthi Film | Nagarjuna Next Film | Vamsi Paidipally Nagarjuna | Anushka Next Movie | Anushka Nagarjuna Affair | Anushka Size Zero | - Filmibeat

నాగార్జున – ప్ర‌గ్య జైశ్వాల్ :
బాలయ్య అఖండలో నటించిన ప్రగ్యా నాగార్జున సరసన ఓం నమో వెంకటేశాయ సినిమాలో నటించింది. నాగార్జున కంటే ప్రగ్య‌ ఏకంగా 30 సంవత్సరాలు చిన్నది.

నాగార్జున – సోనాల్ చౌహాన్ :
నాగార్జునకు జంట‌గా ది ఘోస్ట్ సినిమాలో సోనాల్ చౌహాన్ న‌టించింది. ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. సీనియర్ హీరో బాలయ్యతో ఏకంగా మూడు సినిమాల్లో న‌టించింది. నాగార్జునతో ఘేస్ట్‌లో రొమాన్స్ చేసింది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఏకంగా 28 సంవత్సరాలు.

నాగార్జున – అనుష్క :
సూపర్ సినిమాలో మొదటిసారి కలిసిన నటించింది ఈ జోడి.ఆ తర్వాత పలు సినిమాలో నటించారు.ఇక హిట్ పెయిర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.వీరి మధ్య 23 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.

వీళ్లు మాత్రమే కాకుండా రగడలో నాగార్జున పక్కన నటించిన ప్రియమణి నాగార్జున కంటే 20 సంవత్సరాలు చిన్నది. భాయ్ సినిమాలో నటించిన రీచా గంగోపాధ్యాయ 27 సంవత్సరాలు – మాస్ సినిమాలో నటించిన ఛార్మి 23 సంవత్సరాలు – మన్మధుడు 2 లో నాగార్జున లిప్ కిస్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ 32 సంవత్సరాలు మన నాగ్‌ కంటే చిన్నవాళ్లు. అలా తనకంటే చాలా చిన్న హీరోయిన్లతో నాగార్జున రొమాన్స్ చేస్తున్నాడు.