నటరత్న ఎన్టీఆర్ కెరీర్‌ మలుపు తిప్పిన 5 సినిమాలు ఇవే..!

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో కష్టాలు పడి చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా, అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నటరత్న నందమూరి తారకరామారావు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నటుడిగా మహా నాయకుడిగా ఇప్పటికీ తెలుగువారి మనసుల్లో నిలిచిపోయారు. అలాంటి ఎన్టీఆర్ సినీ జీవితంలో ఇంతటి ఆదరాభిమానాల వెనక ఐదు సినిమాలు ఉన్నాయి.

Adavi Ramudu (1977) - IMDb

అడవి రాముడు:
నటరత్న ఎన్టీఆర్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఎవరికి దక్కని ఓ అరుదైన రికార్డును సృష్టించింది. అప్పటివరకు చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు అంటే కోటి రూపాయలు మించి వచ్చేవి కావు.. కానీ అడివి రాముడు సినిమాకి మాత్రం ఏకంగా నాలుగు కోట్లపైగా కలెక్షన్లు రాబట్టి ఓ కొత్త చరిత్రకు బాట వేసింది.

Prime Video: Vetagadu

వేటగాడు:
నటరత్న ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన మరో సినిమా వేటగాడు. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని ఆకు చాటు పాట రోజుల్లో ఓ సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ రెమ్యూనిరేషన్ రూ.10 లక్షలకు చేరింది.

Sardar Paparayudu 30 Oct 80

 

సర్దార్ పాపారాయుడు:
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సర్దార్ పాపారాయుడు.. ఆ రోజుల్లో సంచలన విజయం అందుకుంది. బహుశా ఈ సినిమాతోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నార‌ని టాక్ ?

Kondaveeti Simham - Alchetron, The Free Social Encyclopedia

 

కొండవీటి సింహం:
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ నటన హైలెట్ గా నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ కుమారుడిగా మోహన్ బాబు నటన అద్భుతం. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

Bobbili Puli Telugu Full Length Movie | NT Rama Rao (Sr NTR), Sridevi,  Dasari Narayana Rao | MTV - YouTube

 

బొబ్బిలి పులి:
దక్షిణ భారతదేశంలోనే తొలిసారి 70 ప్రింట్లతో వందకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.ఇలా ఈ ఐదు సినిమాలు ఎన్టీఆర్ సినీ కెరియర్ లోనే మర్చిపోవాలని సినిమాలుగాా మిగిలిపోయాయి.