మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమాకు 3 అదిరే టైటిల్స్‌… ఏది ఫిక్స్ అవుతుందో ?

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు సినిమా నుంచి అప్ డేట్ వస్తుందంటే టాలీవుడ్‌లో ఎలాంటి సంద‌డి ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తేడాది స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ నుంచి ఇప్ప‌ట‌కీ కొత్త సినిమా రాలేదు. ఎట్ట‌కేల‌కు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – మ‌హేష్‌ కాంబినేష‌న్లో వ‌స్తోన్న మ‌హేష్ 28వ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభ‌మై రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి.

SSMB 28 (2024) - IMDb

ఈ సినిమా నుంచి నెల రోజులుగా హంగామా న‌డుస్తూనే ఉంది. ఇక మ‌హేష్ తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ బ‌ర్త్ డే కానుక‌గా ఈ నెల 31న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో మ‌హేష్ అభిమానులు ఉన్నారు. పైగా కృష్ణ చ‌నిపోయాక వ‌స్తోన్న తొలిజ‌యంతి కావ‌డంతో మ‌హేష్‌, ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్‌కు ఈ సినిమా అప్‌డేట్ ద్వారా సంతోష ప‌ర‌చ‌నున్నారు.

Trivikram Srinivas' team clarifies he's not on social media after this post went viral | Telugu Movie News - Times of India

కృష్ణ జ‌యంతి రోజునే ఈ సినిమా టైటిల్‌తో పాటు అదిరిపోయే లుక్ రివీల్ చేస్తార‌ని అంటున్నారు. టైటిల్ ఏది పెడ‌తార‌న్న‌ది క‌న్‌ఫార్మ్ కాక‌పోయినా మూడు టైటిల్స్ అయితే సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ టైటిల్స్‌లో ‘అమరావతికి అటుఇటు’ అనే టైటిల్ పై ఎక్కువ చ‌ర్చ జ‌రుగుతోంది. త్రివిక్ర‌మ్ సినిమాల టైటిల్స్ అ అక్ష‌రంతో స్టార్ట్ అవ్వ‌డం తెలిసిందే. ఇది కామ‌న్ సెంటిమెంట్‌.

mahesh babu, SSMB 28 కోసం మూడు టైటిల్స్‌.. తండ్రి టైటిల్‌కి మ‌హేష్ ఓకే చెబుతారా! - superstar mahesh babu and trivikram movie ssmb 28 latest updates - Samayam Telugu

అలాగే రెండో టైటిల్‌గా గుంటూరు కారం అనే టైటిల్ వైపు మొగ్గుచూపుతున్నార‌ట‌. ఈ రెండిటితో పాటు ఊరికి మొనగాడు టైటిల్ కూడా తెరపైకొచ్చింది. మ‌రి ఈ మూడు టైటిల్స్ లో ఏది ఫైన‌లైజ్ అవుతుందో తెలియ‌దు కాని.. మూడు టైటిల్స్ పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. త్రివిక్ర‌మ్ అ సెంటిమెంట్ ఫాలో అయితే ఖచ్చితంగా అమ‌రావ‌తి టైటిలే పెట్టే అవ‌కాశం ఉంది.