సౌందర్య ఆ హీరోతోనూ ప్రేమాయణం నడిపిందా.. న‌మ్మ‌లేని నిజాలు…?

అప్పట్లో మహానటి సావిత్రి తర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య మాత్రమే. ఏ స్టార్ హీరో పక్కన ఈమె నటించిన వారి మధ్య కెమిస్ట్రీ రియల్ లైఫ్ జోడీలాగా అనిపించేది. అందమైన ముఖ వచ్చేస్తుతో, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మన‌సు కల్లగొట్టిన సౌందర్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి వంటి అగ్ర సినీ తారలతో నటించి కెమిస్ట్రీని అద్భుతంగా పండించిన సౌందర్య శ్రీకాంత్, జగపతిబాబు, సాయికుమార్ వంటి చిన్న హీరోలతో కూడా నటించి తన ప్రతిభను చాటుకుంది.

Soundarya

అలా పది సంవత్సరాలకు పైగా సినిమాలలో నటించిన సౌందర్య తన కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఫ్లైట్ ఆక్సిడెంట్ లో సడన్ గా మరణించింది. ఆ తర్వాత అంతలా నటించే హీరోయిన్ ఎవరు ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి రాలేదు. సౌందర్య సినిమాల్లో నటించే సమయంలో ఒక హీరోను ప్రేమించిందట. వారు ఇద్దరు పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారని అప్పటి మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

Saikumar Height, Weight, Age, Stats, Wiki and More

ఆ హీరో ఎవరో కాదు సాయికుమార్. అప్పట్లో సౌందర్యతో కలిసి అంతపురం సినిమాలో నటించిన సాయికుమార్ ను సౌందర్య ప్రేమించిందన్న గుస‌గుస‌లు వినిపించాయ‌. ఇద్ద‌రూ క‌న్న‌డీగులే. వారిద్దరి మధ్యన ప్రేమ బలపడడంతో ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారని వార్తలు మీడియాలో తెగ వైరల్ గా మారాయి. వారిద్దరు ప్రేమించుకున్న విషయం తెలిసిన జగపతిబాబు సౌందర్యని ప్రేమించి ఆమెతో ఆ విషయం చెప్పకుండా ఆగిపోయాడన్న పుకార్లూ కూడా అప్పట్లో వైర‌ల్ అయ్యాయి.

Anthahpuram (1998) - IMDb

సౌందర్య చనిపోయిన తర్వాత సాయికుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు దీనిపై ప్రశ్నించగా సౌందర్యకి నేనంటే చాలా ఇష్టమని. నా ప్రవర్తన ఎంతగానో అభినందించేదని. అయితే మా ఇద్దరి మధ్యన అన్నా, చెల్లెల బంధం తప్ప అటువంటిదేమీ లేదని మీడియా అప్పట్లో మా బంధాన్ని తప్పుగా రాసిందని క్లారిటీ ఇచ్చాడు సాయి కుమార్.