రాజ‌మౌళి మ‌హాభార‌తంలో ఎవ‌రికి ఏ పాత్ర అంటే… అదిరే ట్విస్టులు…!

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నడు. రాజమౌళి గతేడాది రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కా పురస్కారం సాధించిన ఘనత కూడా రాజమౌళి ఖాతాలో పడింది. ఆయనతో సినిమా చేయాలని చాలామంది స్టార్ హీరోస్, హీరోయిన్ ఆశ పడుతూ ఉంటారు.

Chiranjeevi Hails Nandamuri Balakrishna For Donating 1.25 Crores Amid  Global Crisis

ప్రస్తుతం ఇతర భాషల్లో హీరోలు కూడా రాజమౌళితో సినిమా ఛాన్స్ వస్తే బాగుందని చూస్తున్నారు. రాజమౌళి ఇప్పటికే తనకు మహాభారతాన్ని సినిమాగా తీయాలని కలగా ఉందని చాలాసార్లు వివరించారు. దీంతో ఏ పాత్రకు ఎవరు సెట్ అవుతారో అనే దానిపై నెటిజన్స్ కొంతమంది తమ ఊహాచిత్రాలను దిద్దుకుంటున్నారు. ఎవరి హీరో ఫ్యాన్స్ వారు ఈ సినిమాలో తమ హీరో కూడా పార్ట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏ క్యారెక్టర్ కు ఏ హీరో సెట్ అవుతాడో తెగ ఊహించుకుంటున్నారు.

ఇదే క్రమంలో ఎవరో ఒక వ్యక్తి ఏ పాత్రకు ఎవరు సెట్ అవుతారు అనే దానిపై ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. కృష్ణుడుగా మహేష్ బాబు, దుర్యోధనుడుగా రానా, కర్ణుడిగా ప్ర‌భాస్, ధర్మరాజుగా పవన్ కళ్యాణ్, భీముడుగా ఎన్టీఆర్, అర్జునుడికి రామ్ చరణ్, పరశురామ్ గా బాలకృష్ణ, అశ్వద్ధామ గా అల్లు అర్జున్, సహదేవుగా నిఖిల్, నక్కలుడిగా అడవి శేష్, అభిమన్యుడిగా అఖిల్, ఏకలవ్యుడిగా సందీప్ కిషన్ నటిస్తే బాగుంటుందనే ఓ రిల్ షేర్ చేశారు.

One birthday boy to the other! Allu Arjun and Akhil Akkineni share wishes  with each other

దాంతోపాటు మీరు ఏ పాత్రలో ఏ హీరో ఉంటే బాగుంటుందో మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి అంటూ ట్యాగ్ చేశారు. దానిపై చాలామంది స్పందిస్తూ వారి ఫేవరెట్ హీరోస్ ఏ పాత్రకు సెట్ అవుతారు అనేదాన్ని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి ఆ వీడియో వైరల్ గానే ఉంది. ఇటీవల దానిపై స్పందిస్తూ రాజమౌళి ఒకవేళ మహాభారతం తీస్తే దానిని 10 భాగాలుగా తీస్తానంటు వివరించారు. మహాభారతంలో పది భాగాలు తీస్తే ఈ హీరోల పరిస్థితి ఏంటి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలు తీసుకుంటారు. అదే 10 భాగాలు అంటే ఈ హీరోలంతా ఇక ఆ సినిమాకి పరిమితం అవ్వాల్సిందే అంటూ పంచ్ లు వేస్తున్నారు. మరి కొంతమంది నెటిజ‌న్స్ సినిమా పూర్తయ్యే వరకు ఆ హీరో ఆయనతోనే ఉండాలి మరో సినిమా చేయడానికి కూడా ఉండదు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Sesh Adivi - Sesh Adivi added a new photo.