శోభ‌న్‌బాబు మ‌ర‌ద‌లిని పెళ్లి చేసుకోవాల్సిన కృష్ణ‌… ఆ కార‌ణంతోనే మిస్ అయ్యిందా…!

తెలుగు సినిమా పరిశ్రమలో అందరితోనూ కలిసి మెలుస్తూ ఉండే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ కృష్ణ. తేనె మనసులు సినిమాతో కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఏకంగా 344 సినిమాలలో హీరోగా నటించారు. అప్పట్లో కృష్ణ ఏడాదికి 15 నుంచి 20 సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో కృష్ణకు ఉన్న మంచి స్నేహితులలో శోభన్ బాబు ఒకరు. కృష్ణ – శోభన్ బాబు మంచి స్నేహితులే కాదు.. ఇద్దరు ఎప్పుడూ కలుసుకుంటూ ఉండేవారు.

ఇంకా చెప్పాలంటే కృష్ణ ఎక్కువగా శోభన్ బాబు ఇంట్లోనే ఉండేవారట. అలాగే కృష్ణ తల్లిదండ్రులు శోభన్ బాబుని తమ పెద్దకొడుకుగా చూసుకునే వారట. అందుకనే శోభన్ బాబును పెద్దబ్బాయి అని పిలిచేవారు. కృష్ణ – శోభన్‌ బాబు ఇద్దరూ తమ కష్టసుఖాలు ఒకరితో ఒకరు చెప్పుకొని సేదతీరే వారట. అప్పట్లో శోభన్ బాబు మరదలు ఒక ఆమె వచ్చి శోభన్ బాబు ఇంట్లో ఉంటూ ఉండేదట.

శోభన్ బాబుకి తన మరదలిని కృష్ణకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరిక ఉండేదట. అయితే కృష్ణ తల్లి గారు నాకు వచ్చే కోడలు నా కొడుకులా తెల్లగా ఉండాలబ్బాయి.. మీరు ఏమి అనుకోవద్దు అని శోభన్ బాబుకి చెప్పేసిందట. అలా నిజజీవితంలో బంధుత్వం కలవాల్సిన కృష్ణ.. శోభన్ బాబుకి కృష్ణ తల్లి గారు చెప్పిన కారణంగా ఆ సంబంధం కుదరలేదు. అయితే విశేషం ఏంటంటే ఆ సంబంధం కుదరకపోయినా కృష్ణ – శోభన్ బాబు స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు.

వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసే ఉండేవారు. కృష్ణకి ఆ తర్వాత తన మరదలు ఇందిరా దేవితో పెళ్లి అయింది. శోభన్ బాబు తన గురువుగారి కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలలో కూడా నటించారు. కృష్ణ ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాక తనతో పాటు కలిసి నటించిన స్టార్ హీరోయిన్ విజ‌య‌నిర్మ‌ల‌ను రెండో భార్య‌గా స్వీకరించిన సంగతి తెలిసిందే. కృష్ణ‌.. విజయనిర్మల రహస్య వివాహం తిరుపతిలో కొద్దిమంది సినిమా ప్రముఖులు.. సన్నిహితుల సమక్షంలో జరిగింది.