ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో దగ్గర నుంచి నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్ర హీరో వరకు అందరికీ శ్రీలీలనే కావాల్సి వస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీ లీల పేరునే జపిస్తున్నారు కొందరు స్టార్ హీరోలు. తమ సినిమాల్లో రెండేసి అవకాశాలు ఇస్తూ ఆమెను నెత్తిన పెట్టుకుంటున్నారు . దానంతటకీ మెయిన్ రీజన్ అమ్మడు అందం అనే చెప్పాలి .
రీసెంట్గా శ్రీ లీల విజయ్ దేవరకొండ తో సినిమాకు కమిటీ అయిన విషయం తెలిసిందే . ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయడానికి సిద్ధపడింది శ్రీలీల . గౌతమ్ తినూరు డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడు అంటూ అప్పట్లో టాక్ వైరల్ అయింది . అయితే దానిపై కొన్నాళ్లు వార్తలు రాకపోవడంతో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది అనుకున్నారు జనాభా .
అయితే రీసెంట్గా ఆ ప్రాజెక్టును పట్టా లెక్కిస్తూ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఫినిష్ చేశారు . ఈ క్రమంలోనే శ్రీలీల – విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించబోతున్నారు అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది . అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను అనుకున్నారట గౌతమ్ తిన్నురి. ఈ పాత్ర ప్రకారం సమంత అయితే ఈ సినిమాకి సూట్ అవుతుంది అని అనుకున్నారట.
కానీ విజయ్ దేవరకొండ ఆల్రెడి సమంతతో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఒకే హీరోయిన్ రిపీట్ చేస్తే జనాలు పెద్దగా ఆదరించారన్న కాన్సెప్ట్ తో లేటెస్ట్ గా క్రేజ్ ఉన్న యంగ్ బ్యూటీ శ్రీలీలను సెలెక్ట్ చేసుకున్నారు అంటూ తెలుస్తుంది . ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంతను కాదని శ్రీలీలను సెలెక్ట్ చేసుకున్నారు అంటే అది కచ్చితంగా ఆమెకు ఉన్న క్రేజ్ అనే చెప్పాలి . చూద్దాం మరి ఈ సినిమా ద్వారా ఎలాంటి హిట్ అందుకుంటుందో శ్రీలీల..?