రామానాయుడికు ఆ స్టార్ హీరోల‌తో గొడ‌వ‌కు కార‌ణం అదేనా..!

అనేక మంది యువ ద‌ర్శ‌కుల‌ను, శ్రీకాంత్ వంటి యువ హీరోల‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన‌.. ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు. అంత‌కుముందు.. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, అన్న‌గారు ఎన్టీఆర్ (రాముడు భీముడు), కృష్ణ‌, శోభ‌న్‌బాబు .. వంటి అగ్ర హీరోల‌తో ఆయ‌న అనేక సినిమాలు చేశారు. ఇక‌, ప్రేమ ఖైదీ, తాజ్ మ‌హ‌ల్ వంటి సినిమాల ద్వారా.. యువ హీరోల‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశారు.

Megastar Chiranjeevi: Lessor-known facts about the GodFather actor |  PINKVILLA

అదేవిధంగా.. ఎంతో మంది హీరోయిన్ల‌ను కూడా సినీరంగంలోకి తీసుకువ‌చ్చి ప్రోత్స‌హించారు. దివంగ‌త క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు శ్రీహ‌రి వంటివారినీ రామానాయుడు ఎంతో ప్రోత్స‌హించారు. తొలినాళ్ల‌లో అంటే.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచికూడా.. రామానాయుడు తెలుగుచిత్ర‌సీమ‌లో ఉన్నారు. మ‌ధ్య‌లో ఒడిదుడుకు లు వ‌చ్చి.. సినిమాల‌కు దూర‌మ‌వుదామ‌ని కూడా భావించారు. స‌రే.. ల‌క్కు క‌ల‌సి వ‌చ్చి.. ఆయ‌న సినీ రంగంలో కుదురుకున్నారు.

Kapu Nadu gives ultimatum to Balakrishna - TeluguBulletin.com

అయితే.. అక్కినేని, ఎన్టీఆర్ త‌ర్వాత‌.. రామానాయుడు.. అప్ప‌టి అగ్ర‌హీరోలుగా ఉన్న చిరంజీవి.. బాల‌కృ ష్ణ‌.. నాగార్జున‌.. వంటివారితో ఎందుకో పెద్ద‌గా క‌లిసి ప‌నిచేయ‌లేక పోయారనే వాద‌న ఉంది. ఒక‌టి రెండు సినిమాలు మిన‌హా.. వీరితో పెద్ద‌గా సినిమాలు చేసింది లేదు. దీనికి కార‌ణాలు ఏవైనా.. కూడా.. ఒక‌టి మాత్రం వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్ని సినిమాలు తీసిన త‌ర్వాత‌.. రామానాయుడు.. త‌న కంటూ.. సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.ఈ ఇమేజ్‌తో ఆయ‌న అగ్ర హీరోల‌కు చేరువ కాలేక పోయార‌నే వాద‌న ఉంది. అంటే.. రామానాయుడు స్కూల్ అనేది అప్ప‌ట్లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆయ‌న ద‌గ్గ‌ర సినిమాలో న‌టించాలంటే..

Here's why Akkineni Nagarjuna decided to take a sabbatical from signing new  films | Telugu Movie News - Times of India

ఈ స్కూల్ రూల్స్ పాటించాల‌నే నిబంధ‌న పెట్టారు. ఒక్క నిముషం లేటు కాకుండా.. షూటింగుల‌కు రావ‌డం.. పెట్టింది తిన‌డం.. ఇచ్చిన చోట ఉండ‌డం లాంటి రూల్స్ ఉండేవి. అలాగే నిర్మాణంలో జోక్యం చేసుకోకుండా.. ఉండ‌డం.. ఔట్ డోర్ షూటింగుల‌కు సింగిల్‌గా రావ‌డం.. ఇలా.. కొన్ని నిబంధ‌నలు.. పెట్టేసరికి రామానాయుడు తో క‌లిసి ప‌నిచేసేందుకు అగ్ర‌హీరోలు ముందుకు రాలేద‌ని అంటారు. ఏదేమైనా.. ఈ గ్యాప్ క‌నిపించ‌కుండా.. చిన్న చిన్న సినిమాలు ప్రేమ ఖైదీ వంటి వాటిని తీసి.. పెద్ద పెద్ద హిట్లు సాధించారు రామానాయుడు.

Tags: film news, filmy updates, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news