రాజమౌళికి ఆ సీనియర్ హీరోతో అంత పెద్ద గొడవ జరిగిందా.. మాటలు కూడా లేవా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి వంటి సినిమాతో ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ గొప్పతనం ఏంటో చాటి చెప్పాడు. అలాంటి ఈ దర్శక ధీరుడు తెరకెక్కించిన సినిమాల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా ప్లాఫ్ కాలేదు. ఇక అలాంటి ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్,సింహాద్రి, ఈగ, మర్యాద రామన్న, ఛ‌త్రపతి, బాహుబలి 1,బాహుబలి 2, యమదొంగ, సై, ఆర్ఆర్ఆర్, మగధీర వంటి సినిమాలు తెరకెక్కించారు.

Telugu Tv Serial Shanti Nivasam Synopsis Aired On ETV Telugu Channel

తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాజ‌మౌళి సినిమాల్లో చిన్న పాత్ర వ‌చ్చినా చాలు అనుకునే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. న‌టీన‌టులు మాత్ర‌మే కాదు.. టెక్నీషియ‌న్లు కూడా రాజ‌మౌళి సినిమాలో ప‌నిచేసే ఛాన్స్ వ‌స్తే జ‌న్మ‌కు చాలు ధ‌న్యం అయిపోతుంద‌ని ఫీల‌వుతూ ఉంటారు. అయితే ఓ సీనియ‌ర్ న‌టుడు మాత్రం రాజ‌మౌళితోనే షూటింగ్‌లో పెద్ద గొడ‌వ‌కు దిగార‌ట‌.

When Rajamouli had a clash with actor Ranganath

ఆ త‌ర్వాత రాజ‌మౌళి కూడా ఆయ‌న‌కు త‌న సినిమాల్లో ఛాన్సులు ఇవ్వ‌లేద‌నే అంటారు. ఆ సీనియ‌ర్ న‌టుడు ఎవ‌రో కాదు రంగ‌నాథ్‌. రాజ‌మౌళి సినిమాల్లోకి రాక‌ముందు రాఘ‌వేంద్ర‌రావు బ్యాన‌ర్లో శాంతినివాసం సీరియ‌ల్ నిర్మిస్తే దానికి రాజ‌మౌళీయే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అప్ప‌ట్లో ఈటీవీలో ప్ర‌సార‌మైన ఈ సీరియ‌ల్ సూప‌ర్ హిట్ అయ్యింది.

Actor Ranganath Rare Photos

ఆ ఫ్యామిలీ పెద్ద‌గా రంగ‌నాథ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. రంగ‌నాథ్ న‌ట‌న‌లో ఎంతో గొప్పోడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే శాంతినివాసం సీరియ‌ల్‌ను రాజ‌మౌళి సినిమా రేంజ్‌లో తీశాడ‌ట‌. ఇక కొన్ని సార్లు రాజ‌మౌళి చెప్పిన విష‌యాల‌ను కూడా రంగ‌నాథ్ ప‌ట్టించుకోకుండా.. ఇలా ఎందుకు ? అదీ ఇదీ అని డిస్క‌ర్ష‌న్ పెట్టేవాడ‌ట‌. ఆ టైంలో రంగ‌నాథ్ రాజ‌మౌళిపై బాగా కోప‌డ్డేవార‌ట‌.

Couldn't Have Done Baahubali Without Prabhas,' Says Director SS Rajamouli

అయినా రాజమౌళి అవేం ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుపోయేవార‌ట‌. త‌ర్వాత రాజ‌మౌళి ఎంతో గొప్ప డైరెక్ట‌ర్ అయ్యారు. శాంతినివాసం సీరియ‌ల్‌లో న‌టించిన‌ న‌టులు అంద‌రికి త‌న సినిమాల్లో ఛాన్సులు ఇచ్చినా రంగ‌నాథ్‌ను మాత్రం త‌న సినిమాల్లో పెట్టుకోలేదు. దీనికి కార‌ణం శాంతినివాసం సీరియ‌ల్ టైంలో జ‌రిగిన గొడ‌వే కార‌ణం అంటారు. ఆయ‌న త‌న‌తో ప్ర‌వ‌ర్తించిన తీరుకు రాజ‌మౌళి బాగా నొచ్చుకున్నార‌నే టాక్ కూడా ఉంది.