ఆ సీటు గాలికొదిలేసిన బాబు..గెలవడం కష్టమని లైట్ తీస్కొంటున్నారా…!

ఏపీలో తెలుగుదేశం పార్టీ వేగంగా పుంజుకుంటుంది..నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. అధికార వైసీపీని గద్దె దించి అధికారంలోకి రావాలని చూస్తుంది. అయితే టి‌డి‌పి అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న బలం సరిపోదు..ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. కొన్ని సీట్లలో టి‌డి‌పి ఇంకా వెనుకబడి ఉంది. ఇటీవల సర్వేల్లో కూడా టి‌డి‌పికి 80-90 సీట్లు వరకు రావచ్చు అని తేలింది.

అంటే ఇంకా ఎన్ని సీట్లలో టి‌డి‌పి వెనుకబడిందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సీట్లలో సరైన నాయకులు కూడా లేరు. చంద్రబాబు కూడా ఆ సీట్లని సైతం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అలా అరకు సీటుని బాబు లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి డిపాజిట్ కోల్పోయిన ఏకైక సీటు ఇదే. ఇక్కడ టి‌డి‌పి నుంచి కిడారి శ్రావణ్ కుమార్ పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.

అయితే ఎన్నికల్లో ఓడిపోయాక చాలామంది నేతలు మళ్ళీ బలపడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ శ్రావణ్ ఆ దిశగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. పెద్దగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు కూడా లేరు. వాస్తవానికి అరకులో వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది..ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడటంలో టి‌డి‌పి వెనుకబడింది. అలాగే చంద్రబాబు సైతం ఈ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా సమీక్షా సమావేశం సైతం నిర్వహించినట్లు కనిపించడం లేదు.

No 'hanky panky' in projects initiated with previous govt: Chandrababu  Naidu | Mint

అలాగే బాబు..ఈ నియోజకవర్గంలో పెద్దగా పర్యటించలేదు. దీంతో అరకులో టి‌డి‌పి పరిస్తితి దారుణంగా ఉంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ సీటు శ్రావణ్‌కు ఫిక్స్ చేస్తారా ? లేదా ? అనే క్లారిటీ కూడా లేదు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 27 వేల ఓట్లు వరకు తెచ్చుకున్న దొన్ను దొర తర్వాత టి‌డి‌పిలోకి వచ్చారు. ఒకవేళ శ్రవణ్‌ని తప్పించి దొన్ను దొరకు సీటు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే ఎవరికి సీటు ఇచ్చిన అరకులో టి‌డి‌పి గెలవడం అనేది కష్టమనే పరిస్తితి.

Tags: AP, ap politics, chandra babu naidu, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp