సీనియ‌ర్ ఎన్టీఆర్ పెళ్లి పత్రిక… ఎన్టీఆర్ భార్య ఎవ‌రు… ఏ ఇంటి ఆడ‌ప‌డుచో తెలుసా….!

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే తెలుగునాట తెలియని వారుండరు. ఆంధ్రుల ఆరాధ్య దైవంగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ అప్పటి జనరేషన్ వారికే కాదు.. ఇప్పటి వారికి సైతం ఓ రోల్ మోడల్. ఇక ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలలో ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నారు. ఇప్పటికీ రాజకీయాలలో ఆయన చూపిన బాటలోనే ఎందరో నాయకులు నడుస్తున్నారంటే ఆయన మేధస్సు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే నందమూరి తారకరామారావు 1942లో మే 2 న వివాహం చేసుకున్నారు. ఆయ‌న ముందు భార్య బ‌స‌వ‌తార‌కం ఎవ‌రో కాదు ఆయ‌న‌కు స్వ‌యానా మేన‌మామ కుమార్తె. కాగా తాజాగా ఎన్టీఆర్ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పెళ్లి పత్రికని పెళ్లి కుమార్తె తండ్రి కాట్రగడ్డ చెంగయ్య ప్రింట్ చేయించారు.

N. T. Rama Rao Height, Age, Family, Wiki & More

ప్రస్తుతం ఈ ఫొటో అన్ని సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌లో తెగ ప్రచారం అవుతుంది. ఒక అభిమాని ఆ ఆహ్వాన పత్రిక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం చనిపోవడంతో 1985లో ఆమె జ్ఞాపకార్థం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించి ఉచితంగా వైద్య సేవలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ హాస్పిటల్ నందమూరి బాలకృష్ణ నడిపిస్తున్నాడు.

N. T. Rama Rao Wiki, Age, Death, Wife, Family, Biography & More - WikiBio

కాగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలను బాలకృష్ణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని కూడా చాలా ఘనంగా నిర్వహించారు.

Unravelling the enigma

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం మొత్తం ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా టెక్సాస్, ఖతార్ దోహా వంటి దేశాల్లో ఈ ఉత్సవాలు ఇటీవల జరిగాయి. ఇక ఈ నెల 28న శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.