ఆ సినిమాలో కూడా ఎన్టీఆర్ విల‌నేనా… బాక్సాఫీస్ బాక్సులు బ‌ద్దలే…!

త్రిబుల్ ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసబెట్టి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియన్ సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి. ఈ రెండు సినిమాల‌తో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘వార్2’లో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

Jai Lava Kusa Telugu Movie Review | NTR Jai Lava Kusha Review | Jai Lava  Kusa | Jr NTR Jai Lava Kusa Telugu Movie Review | 123telugu.com

ఇక త‌ర్వ‌లోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వార్ సినిమా బాలీవుడ్‌లో బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రాబోయే వార్ 2 అంత‌కు మించి ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఈ సినిమా ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా త‌న‌ 30వ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ‘కెజియఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు.

Temper Movie Review

ప్రభాస్ హీరోగా నీల్ చేస్తున్న ‘సలార్’ కంప్లీట్ అయ్యాక, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, దాని కంటే ముందు ‘వార్ 2’ షూటింగ్ స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే ఈ ఏడాది నవంబర్‌లో ‘వార్ 2’ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని హృతిక్ రోషన్, ఎన్టీఆర్, యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా భావిస్తున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్‌ తో సమానంగా ఉండే పాత్రలో న‌టించ‌బోతున్నార‌ట‌.

War 2 Official Trailer | Hrithik Roshan | Jr Ntr | Ayan Mukerji | War 2  Teaser | Update | YRF Spy - YouTube

అయితే పాత్ర కాస్త‌ నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ఓ వార్త బయటకు వచ్చింది. ఎన్టీఆర్ జైల‌వ‌కుశ‌లో నెగ‌టివ్ రోల్ తో అద‌రగొట్టాడు. ఇప్పుడు వార్ 2లో విల‌న్‌గా చేస్తే ఖ‌చ్చితంగా ఇండియ‌న్ బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వ్వ‌డం ఖాయం. జై ల‌వ‌కుశ‌తో పాటు అలాగే టెంపర్ సినిమాలోను ఆయన పాత్ర ఎక్కువ శాతం నెగటివ్ రోల్‌ లోనే ఉంటుంది. ఇప్పుడు మరి వార్‌2 సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొంతకాలం ఎదురు చూడాల్సిందే.