ఎన్టీఆర్ సినిమా అంటే ఆ రెండూ ఉండాల్సిందే… అంతే…!

ఎన్టీఆర్ సినిమా అంటే.. మాట‌లు కాదు! అనే టాక్ ఉంది. ఎవ‌రో ఒక‌రు చూస్తారు.. హిట్ట‌వుతుంది.. డ‌బ్బులు వ‌స్తాయి.. అనే త‌ర‌హాలో గ‌తంలో షూటింగులు జ‌రిగేవి కాదు. ఇప్పుడంటే.. ఏదో ఒక రూపంలో డ‌బ్బులు గుంజుకుంటే చాలు.. మన సొమ్ము మ‌న‌కు వ‌స్తే చాలు.. అది ఓటీటీనా..ధియేట‌రా.. శాటిలైట్ రైట్సా.. ఏదైనా కూడా.. డ‌బ్బులు వ‌స్తే.. చాల‌ని అనుకునే ప‌రిస్థితి ఉంది.

NANDAMURI TARAKA RAMA RAO (NTR) MOVIE BY DATE AND CATEGORY/GENRE - NTR- MOVIES LIST

కానీ, గ‌తంలో అన్న‌గారి హ‌యాంలో ఇలాంటి ప‌రిస్థితి ఉండేది కాదు. పైగా ఇన్ని మాధ్య‌మాలు కూడా లేవు. అంతేకాదు.. అన్న‌గారి సినిమాలు అంటే.. పెద్ద పెద్ద క‌వులు, ర‌చ‌యిత‌లు, రాజ‌కీయ నేత‌లు కూడా.. చూసే వారు. ప్ర‌తి డైలాగును ప‌ట్టి ప‌ట్టి వినేవారు. పాట‌ల్లోని లిరిక్స్‌ను కూడా చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించేవారు. అంతేకాదు.. సినిమాల‌పై వెంట‌నేపుస్త‌కాలు కూడా వ‌చ్చేవి.

Remembering Sr NTR on his birth anniversary: Chiranjeevi, Jr NTR, Kalyanram and others pay rich tributes to legendary actor | Telugu Movie News - Times of India

విశ్లేష‌ణ‌లు కావు.. డైలాగుల వారిగా.. సినిమాలకు పుస్త‌కాలు రాసేవారు. సినిమా విడుద‌లైన మూడు రోజుల్లోనే పుస్త‌కాలు బ‌య‌ట వ‌చ్చేవి. దీంతో అన్న‌గారి సినిమా పుస్త‌కాలు కూడా బాగా అమ్ముడు పోయేవి. ఇక‌, ఈ విష యాల‌ను దృష్టిలో పెట్టుకునేఅన్న‌గారు.. డైలాగుల నుంచి పాట‌ల వ‌ర‌కు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే వారు. ప్రాస.. ప‌స రెండు ఉండాలోయ్‌.. ! అనేవార‌ట‌. ముఖ్యంగా వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి, సి.నారాయ ణ‌రెడ్డి వంటివారితో ఉన్న చ‌నువుతో.. మీ పాట‌లు, మాట‌ల్లో ప్రాస‌..ప‌స రెండు ఉంటాయి గురూజీ! ఇది చాలా కాలం.. అన్న‌గారు పాటించారు.