ఎందుకో.. ఎక్క‌డో తేడా… టీడీపీ ప్ర‌చార దూకుడుతో వైసీపీలో వ‌ణుకు మొద‌లైందా…?

రాజ‌కీయాల్లో ప్ర‌చారం అత్యంత కీల‌కం. ఈ విష‌యంలో టీడీపీది అందెవేసిన చేయి. ఆది నుంచి కూడా పార్టీ ప్ర‌చారంలో ముందున్న విష‌యం తెలిసిందే. డిజిట‌ల్ ప్రచారంలో అయినా.. మీడియా ప్ర‌చారంలో అయినా.. మౌత్ ప‌బ్లిసిటీలో అయినా.. టీడీపీని కొట్టిన పార్టీ లేదంటే..అతిశ‌యోక్తి కాదు. ఎన్నిక‌ల్లో అయితే.. ఈ ప్ర‌చారం మ‌రింతగా పెరుగుతుంది. ప్ర‌స్తుతం ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగేందుకు మ‌రో ఏడాది స‌మ‌యం ఉంది.

అయితే.. ఈలోగానే.. టీడీపీ చేస్తున్న ప్ర‌చారం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ అనే తేడా లేకుండా.. టీడీపీ విజృంభిస్తున్న తీరు..న‌భూతో అన్న విధంగా సాగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీకులు. ఒక‌వైపు..చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, యువ నాయ‌కుడు…నారా లోకేష్‌ ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. అదేస‌మ‌యంలో ఆన్‌లైన్‌లోను.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లు.. ముఖ్యంగా ఇదేం ఖ‌ర్మ‌, బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ప‌బ్లిసిటీ పీక్‌కు వెళ్లింది.

విభిన్న ర‌కాల పాట‌ల‌తో అద‌ర‌గొడుతున్నారు. యూట్యూబ్ నుంచి డిజిట‌ల్ మీడియా వ‌ర‌కు కూడా టీడీపీ జోరుగా ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, య‌వ‌గ‌ళం పాద‌యాత్ర‌కు సంబంధించి ఇప్పటికే 25 ర‌కాల పాట‌లు యూట్యూబ్ స‌హా ఫోన్ల రింగ్ టోన్‌ల‌లో దుమ్మురేపుతున్నాయి. దీనికితోడు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ.. రీల్స్ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కంపేరిటివ్ స్క్రీన్ షాట్స్‌తో సోష‌ల్ మీడియాను కుదిపేస్తున్నారు.

Remove fans from govt offices, it's YCP's symbol' - TeluguZ.com

ఇలా చూసుకుంటే.. వైసీపీ ఈ రేంజ్‌లో ఎక్క‌డా టీడీపీకి పోటీ ఇవ్వ‌లేక పోతోంద‌నేది వాస్త‌వం. పైకి ప్ర‌చారం ఉంద‌ని అనుకున్నా.. వైసీపీ ఎక్క‌డా కూడా.. పెద్ద గా డిజిట‌ల్ మీడియాలో పోటీ ప‌డ‌లేక పోతోంద‌న్న‌ది వాస్త‌వం. అందుకే.. ప్ర‌చారంలో వైసీపీ కంటే కూడా.. టీడీపీ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే రేంజ్‌ను మ‌రో 10 నెల‌లు కొన‌సాగిస్తే.. ఓట‌ర్ల‌ను మెంట‌ల్‌గా టీడీపీవైపు తిప్పుకొనే ఛాన్స్ ఉంటుంద‌ని చెబుతున్నారు.