ఎన్టీఆర్ అన్న ఆ ఒక్క మాట‌తో చెల‌రేగిపోయిన వేటూరి… !

తెలుగు సినీ రంగంలో త‌న‌దైన పాత్ర పోషించిన అన్న‌గారు ఎన్టీఆర్‌.. అంద‌రినీ ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. ఎవ‌రినీ నొప్పించేవారు కూడా కాదు. పైగా అసూయ అనేది అస‌లే లేదు. ఎవ‌రైనా బాగా న‌టిస్తున్నారంటే.. ఆయ‌నే ఎన్నో అవకాశాలు ఇప్పించారు. ఇక‌, ఆయ‌న సొంత జిల్లాపై ఎన‌లేని మ‌మ‌కారం ఉండేది. కృష్ణాజిల్లా నుంచి ఎళ్లిన వారిలో దిగ్గ‌జ న‌టులుగా పేరు తెచ్చుకువారు కొంద‌రు ఉన్నారు.

NTR special: The Day producer understood the greatness of the legend -  JSWTV.TV

వారిలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు(గుడివాడ‌), శోభ‌న్‌బాబు(మైల‌వ‌రం) వంటివారు ఫామ్‌లో పుంజుకున్నారు. ఇక‌, ఈ ప‌రంప‌ర‌లో చాలా మంది ఉన్నారు. ఓల్డ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌వాడ‌కు చెందిన సీఎస్ ఆర్‌తో అన్న‌గారికి ఎంతో అనుబంధం ఉండేది. ఆయ‌న‌ను గురువుగారు అని సంబోధించేవార‌ట‌. కానీ, సీఎస్ ఆర్ మాత్రం. నువ్వే గురువ్వి.. నేను నీకు గురువా.. నాతోటే చ‌మ‌త్కారాలా..! అని స‌టైర్లు రువ్వేవార‌ట‌.

ఇక‌, ఇదే కృష్ణా జిల్లా నుంచి సినీరంగంలోకి ప్ర‌వేశించిన ప్ర‌ముఖ ర‌చ‌యిత వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి. ఆయ‌న గ‌తంలో నాట‌కాల రాసేవారు. అదేవిధంగా రేడియో క‌థ‌లు, పుస్తకాల‌కు క‌విత‌లు రాస్తూ.. సినీరం గంలోకి వెళ్లారు. ఈ ప‌రిచ‌యం.. అన్నగారికి ఎంతో న‌చ్చింది. అన్న‌గారు ఎన్టీఆర్‌కు క‌వులు అంటే చాలా మ‌క్కువ‌. వారిని ఎంతో గౌర‌వించేవారు. తిరుప‌తి వెంక‌ట‌క‌వులు, సీనారే.. వంటివారికి ఎంతో ఎన్నో అవ‌కా శాలు క‌ల్పించారు ఎన్టీఆర్‌.

lyrics written Veturi Sundararama Murthy Jayanthi - Sakshi

ఈ క్ర‌మంలోనే వేటూరి సుంద‌ర‌రామ్మూర్తిని కూడా ఎన్టీఆర్ ఎంతో మందికి ప‌రిచ‌యం చేయ‌డంతోపాటు.. ఆయ‌న‌తో క‌లిసి మెలిసి తిరిగారు. ఒక ద‌శకంలో వేటూరి-ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెలుగు తెర దుమ్ము రేపింది. ఈ నేప‌థ్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు అన్న‌గారు చెప్పింది ఏంటంటే.. కృష్ణాజిల్లా పేరు నిల‌బెట్టాల‌నే. దీనిని ఆసాంతం వేటూరి పాటించారు. ఆయ‌న మూలాలు మ‌ర‌వ‌కుండా ముందుకు సాగారు. ఇదీ సంగ‌తి.