ఎన్టీఆర్ కాల్షీట్ కోసం నిర్మాత‌లు ఇలా కూడా చేసేవారా… దండం పెట్టాల్సిందే..!

సీనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగు ఇండ‌స్ట్రీలో అనేక విజ‌యాలు అందుకున్నారు. ఇప్ప‌ట్లో మాదిరిగా ఒక సినిమాను నేరుగా భాష మార్చి డ‌బ్ చేయ‌డం చాలా అరుదు. అందుకే కేవ‌లం క‌థ‌ల‌ను మాత్ర‌మే కొనుగోలు చేసుకుని.. వాటిని తిరిగి సినిమాలు తీసేవారు. అవి హిట్ట‌య్యేవి కూడా. ఒక‌ప్పుడు క‌న్న‌డంలో సూప‌ర్ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్‌గా వెలిగిపోయిన బీఆర్ పంతులు (బుడ‌గూరు రామ‌కృష్ణ‌య్య పంతులు) ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి వీర‌పాండ్య క‌ట్ట‌బొమ్మ‌న సినిమాను తీయాల‌ని అనుకున్నారు.

Jr NTR pays homage to his legendary grandfather Nandamuri Taraka Rama Rao; see pics | Telugu Movie News - Times of India

ఇడి డైరెక్ట్ క‌న్న‌డ మూవీ. అప్ప‌టికే అన్న‌గారు చాలా సినిమాల్లో హిట్లు కొట్ట‌డం. ఏ వేషం వేసినా ఆయ‌న న‌ప్పుతార‌నే పేరు రావ‌డంతో పంతులు ఆయ‌న‌ను సంప్ర‌దించేందుకు ప్ర‌య‌త్నించారు. పైగా.. ఈయ‌న మ‌న తెలుగు వారే. అప్ప‌టి నిజాం సంస్థానంలోనే ఈయ‌న పుట్టిన పెరిగారు. ఈయ‌నకు తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం భాష‌లు క‌ర‌త‌లామ‌ల‌కం. దీంతో తాను తీయ‌బోయే వీర‌పాండ్య క‌ట్ట‌బొమ్మ‌న సినిమాను ఒకేసారి తెలుగు, క‌న్న‌డంలో తీయాల‌ని అనుకున్నారు. దీనికి ఎన్టీఆర్ అయితే బెట‌ర్ అని భావించారు.

అందుకే మ‌ద్రాస్‌లోనే ఒక వారం రోజులు క్యాంపు వేసుకుని మ‌రీ అన్న‌గారి కోసం ప్ర‌య‌త్నించారు. అంటే ఎన్టీఆర్ కాల్షీట్ల కోసం నిర్మాత‌లు ఎలా ట్రై చేసేవారో చెప్పేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ‌. కానీ, అన్న‌గారు అదే స‌మ‌యంలో పాండురంగ మ‌హ‌త్యం స‌హా విఠాలాచార్య‌తో మ‌రికొన్ని సినిమాలు ఒప్పుకొని ఉన్నారు. దీంతో అది సాధ్యం కాలేదు. అయినా.. ఎన్టీఆర్ కాల్ షీట్ 30 రోజులు ఇచ్చినా చాలు.. ఏదో ర‌కంగా సినిమాను పూర్తి చేస్తామ‌ని అన్నార‌ట పంతులు.

Remembering Tollywood's yesteryear legendary actor Sr NTR on his 23rd death anniversary today | Telugu Movie News - Times of India

కానీ, ఆ రోజులు కూడా ఖాళీలేక‌పోవ‌డంతో రాజ్‌కుమార్‌తో ఈ సినిమాను తీసేశారు. అయితే, దీనిని కేవ‌లం క‌న్న‌డ‌కే ప‌రిమితం చేశారు. ఈ సినిమా సూప‌ర్‌హిట్‌టాక్ వ‌చ్చింది. దీంతో ఎన్టీఆర్ స్వ‌యంగా పంతులును క‌లిసి ఇద్ద‌రం క‌లిసి చేద్దామ‌ని తెలుగులో నిర్మించాల‌ని కోరారు. దీనికి ఆయ‌న కూడా ఒప్పుకొన్నారు. క‌థ‌లో తెలుగు ద‌నం మేళ‌వించి..రెడీ కూడా చేశారు.

తొలిరోజు ముహూర్తానికి అన్న‌గారిపై షాట్ తీశారు. కానీ, అనూహ్యంగా సినిమా రెండో రోజు పంతులు క‌న్నుమూశారు. దీంతో ఆ సినిమా అక్క‌డితో ఆగిపోయింది. దీనిని త‌ర్వాత అన్న‌గారు స్వ‌యంగా తీయాల‌ని అనుకున్నా కుద‌ర‌లేదు. ఈ కోరిక త‌ర్వాత వ‌చ్చిన మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాలో కొద్దిపాటి సెక‌న్లు ఉండే వేషంతో స‌రిపుచ్చుకున్నారు.