ఎన్టీఆర్ రాముడిగానే కాదు భ‌ర‌తుడిగా న‌టించిన సినిమా ఏదో తెలుసా… ఆ టాప్ సీక్రెట్ ఇదే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఇప్పటివరకు 29 సినిమాలలో నటించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమా 30వ సినిమా కావటం విశేషం. ఇక ఎన్టీఆర్ 31వ సినిమా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఎన్నో సినిమాలలో నటించాడు.

కాలేజీ విద్యార్థిగా, రాజకీయ నాయకుడిగా ఫ్యాక్షన్ లీడర్‌గా అటు యముడుగాను, రాముడిగాను, కొమరం భీమ్ గా, జై లవకుశ సినిమాలో రావణుడు గాను ఇలా ఎన్టీఆర్ సాంఘిక ప్రధానమైన పాత్రలతో పాటు పౌరాణిక పాత్రాలలోనూ తాను అచ్చు గుద్దినట్టు ఒదిగిపోతానని ఎన్నో సందర్భాలలో ప్రూవ్ చేసుకున్నాడు. చిన్నప్పుడే ఎన్టీఆర్ రామాయణం సినిమాలో రాముడిగా ఎంతలా మెప్పించాడో చూసాం. అప్పట్లో ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాకు నంది అవార్డు కూడా వ‌చ్చింది.

ఎన్టీఆర్ నటించిన పౌరాణిక పాత్రలకు ఈ తరం నుంచి.. ఆతరం జనరేషన్ వరకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అసలు ఈ తరం జనరేషన్ హీరోలలో పౌరాణిక పాత్రలలో అలా నటించడం ఎన్టీఆర్ కు మాత్రమే దక్కింది. అయితే ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది. ఎన్టీఆర్ భరతుడిగా కూడా నటించాడు. తన తాత ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాలో ఎన్టీఆర్ నటించాడు. అదే సినిమాను హిందీలోనూ తెరకెక్కించారు.

ఆ సినిమాకు ఎన్టీఆర్ దర్శకుడు కూడా..! ఆ సినిమాలో ఎన్టీఆర్ భ‌ర‌తుడిగా నటించాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఇక గత ఏడాది వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణకు చెందిన స్వాతంత్య్ర‌ సమరయోధుడు, గోండు గిరిజన జాతి నాయకుడు కొమరం భీం పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

NTR Fans on Twitter: "22 Years back, Young Tiger #NTR @tarak9999 debuted as  a Child Artist playing Lord Rama in "Bala Ramayanam"  #22YearsForBalaRamayanam https://t.co/8z8y0Zykrp" / Twitter

ఇంకా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నట విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా వెండితెరపై మెరిశారు. ఈ చిత్రంలో బాలయ్య కూడా నటించడం విశేషం. మూడు తరాల నందమూరి హీరోలు కలిసి నటించిన అరుదైన చిత్రంగా ఇది రికార్డులకు ఎక్కింది. అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమా విడుదల కాని సంగతి తెలిసిందే.