సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం.. ఈ రంగుల లోకంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం.. సినిమాల్లో ఫేమ్ రాగానే సరోపోదు.. ఆ ఫేమ్ కాపాడుకోవాలి.. అవకాశాలు వస్తున్నంత కాలం మనల్ని అందరూ గుర్తు పెట్టుకుంటారు..ఆ తర్వాత ప్రేక్షకులు మనల్ని పట్టించుకోవడమే మానేస్తారు. అలా తెరవెనకే కనుమరుగైపోయిన హీరోయిన్లలో గజాల కూడా ఒకరు.
ఈమె అసలు పేరు రాజి. సినిమాలలోకి వచ్చాక తన పేరుని గజాల గా మార్చుకుంది. తెలుగులో ఉన్న అగ్ర హీరోలు అందరి సరసన నటించింది గజాల. 2001లో నాలో ఉన్న ప్రేమ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కలుసుకోవాలని, స్టూడెంట్ నెంబర్ 1, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తెలుగులో దాదాపు 30 సినిమాలకు పైగా నటించింది గజాల.
అదే సమయంలో తెలుగులు ఓ యంగ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడింది. ఆ తర్వాత అతను మోసం చేశాడంటూ ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం… అప్పట్లో పెద్ద దుమారం కూడా రేపింది. అయితే, అదృష్టవశాత్తు ఆ గండం నుంచి గట్టెక్కింది. ఆ సమయంలో యాక్షన్ హీరో అర్జున్ ఆమెకు సాయం అందించడంతో ఆమె తిరిగి సాధారణ స్థితికి రాగలిగింది.
ఇక 2016లో బాలీవుడ్ టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్‌ను వివాహంపెళ్లి చేసుకొంది గజాలా. ఆతర్వాత ముంబైకు వెళ్లి స్థిరపడింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది గజాలా.ఇక ప్రస్తుతం ఆమె వయసు 37 ఏళ్లు అయినప్పటికీ తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.