“కుక్క కాటుకు చెప్పు దెబ్బ”.. ఇచ్చిపడేసిన ఎన్ టీఆర్.. చెల్లుకి చెల్లు అయిపోయిందిగా..!!

వామ్మో .. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ ఎంత పెరిగిందో తెలియదు కానీ ..నెగిటివిటీ ..వల్గర్ కంటెంట్ ..తలనొప్పులు ఎక్కువైపోతున్నాయి . ఓ స్టార్ హీరో బర్త్ డే కి విష్ చేసిన తప్పే .. విష్ చేయకపోయినా తప్పే . ఫోటో పోస్ట్ చేసినా తప్పే ..ఫోటో పోస్ట్ చేయకపోయినా తప్పే .. మరో హీరోకి బర్త డే విషెస్ చెప్పిన తప్పే ..ఈ హీరోకి విషెస్ చెప్పకపోయినా తప్పే.. ఇలా ప్రతిదానికి రాద్దాంతం చేసేస్తున్నారు కొందరు అభిమానులు . వాళ్లు మరి నిజంగానే అభిమానులు అంటారా..? లేక ఇంకేమైనా అంటారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు .

RRR Director SS Rajamouli & Actors Ram Charan, Jr. NTR To Attend Golden Globes Post Film

 

కాగ రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా వ్స్ అల్లు ఫాన్స్ మధ్య వార్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయిందో మనందరికీ బాగా తెలిసిందే. ఆ వార్ అలా కూసింత సర్దుమనిగిందో లేదో సోషల్ మీడియాలో తెరపైకి మరో ఇద్దరు టాప్ హీరోల వార్ వైరల్ అవుతుంది . వాళ్ళు ఎవరో కాదు ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసినా తారక్ – చరణ్.

యస్ వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దానికి కారణం లేకపోనూ లేదు . ఈ మధ్యకాలంలో వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో మాట్లాడుకున్న దాఖలాలు లేవు.. ఇద్దరు కలిసి అటెంట్ద్ అయిన ఓ మీటింగ్.. ఓ ఈవెంట్ కి అటెండ్ అయిన సందర్భాలు లేవు. నిజానికి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అప్పటినుంచి ఈ ఇద్దరు కలిసిన సందర్భాలే లేవు . అందుకే వీళ్ళ మధ్య ఇన్నర్ గా ఏదో వార్ జరుగుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దానికి తోడే రీసెంట్గా చరణ్ బర్త్ డే పార్టీకి తారక్ రాకపోవడం మైనస్ ..అయితే రీసెంట్ గా తారక్ గ్రాండ్గా ఇచ్చిన పార్టీకి చరణ్ రాకపోవడం మైనస్ గా మారింది.

Ram Charan dissects rumoured decades-long feud between his and Jr NTR's families, admits they have 'healthy competition' | Entertainment News,The Indian Express

అఫ్ కోర్స్ ..చరణ్ మాల్దీవ్స్ లో ఉన్నాడు. ఉపాసనతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయినా సరే విర్చువల్ గా అటెండ్ అవ్వచ్చుగా అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. అయితే దీనిపై కొందరు మాత్రం రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . నందమూరి బిడ్డ దెబ్బ అంటే అలానే ఉండాలి ..తనని ట్రోల్ చేసిన వారికి.. తనని అవమానించిన వారికి ఇచ్చి పడేస్తాడు . “కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే కదా” అంటూ పాతను సామెతను తీసుకొచ్చి..ఈ ఇష్యూ లో మెన్షన్ చేస్తూ హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు తారక్ -చరణ్ ల బిహేవియర్ చూస్తుంటే వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అని అభిమానులకే కాదు ..సినీ స్టార్స్ కి సైతం డౌట్లు వస్తున్నాయి . దీనిపై త్వరలోనే వీళ్ళి క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం సోషల్ మీడియాలో అభిమానులు కొట్టుకు చచ్చిపోతారు . చూద్దాం మరి ఈ ఇద్దరి హీరోలు ఎలా రెస్పాండ్ అవుతారో..?