జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే… డైట్ మెన్ ఇంత ట‌ఫ్‌గా ఉంటుందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నందమూరి వారసుడుగా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు. ప్ర‌స్తుతం తార‌క్ కొరటాల శివ డైరెక్షన్లో నటిస్తున్న ఎన్టీఆర్ పాత ఫొటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన ఫుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి.

Top 10 Unknown Facts About Jnr.NTR | Latest Articles | NETTV4U

ఎన్టీఆర్ ప్రస్తుతం స్లిమ్ గా ఉన్నా ఒకానొక సమయంలో అధిక బరువు ఉండేవారు. ఎన్టీఆర్ బరువు తగ్గినప్పటి నుంచి తన డైట్ విషయంలో ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడ‌ట‌. ఆ కారణంగానే ఎన్టీఆర్ బాడీ అంతా పర్ఫెక్ట్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ మార్నింగ్ నిద్ర లేవటం తర్వాత యోగ, ఎక్ససైజ్ అంటూ ఏదో ఒక వర్కౌట్స్ రెండు గంటలపాటు చేసేవారట.

Aamir Khan To Share Screen Space With Jr NTR In NTR 31? What We Know

ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా రాగిజావను కంపల్సరిగా రెండు గ్లాసులు తాగేవారట. వాటి తర్వాత వాటర్ లో నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకునేవారట. రెండు లేదా మూడు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాడ‌ట‌. భోజనం విషయానికి వస్తే ఖ‌చ్చితంగా రాగిజావ నాటుకోడి ఎంతో ఇష్టంగా తింటాడ‌ట. ఎలాంటి డైట్ ఫాలో అయినా సరే తాను తినాలనుకునే ఆహారాన్ని కచ్చితంగా తీసుకుంటాడ ఎన్టీఆర్‌. ఆ తర్వాత నైట్ డిన్నర్ కి ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటాడు.. మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేస్తే మాత్రం ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్స్ తెప్పించుకుని తింటాడ‌ట.

The Jr NTR Family

ఎన్టీఆర్ తాను తీసుకొనే ఆహారంలో కచ్చితంగా డీప్ ఫ్రై ఐటమ్స్, ఆయిల్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోరట. ఈ డైట్ కేవలం ఎన్టీఆర్ కాకుండా ఆయన ఫ్యామిలీ మొత్తం ఫాలో అవుతారట. ఈ డైట్ చూస్తుంటే ఎన్టీఆర్‌కు తన హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనే చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్ కోసం అయితే ఎన్టీఆర్ చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా డైట్ మెయింటైన్ చేస్తేనే బాడీ అలా ఫిట్‌గా వ‌చ్చింద‌ని అంటారు.