బోయపాటికి ఊర్వశి అంత నచ్చిందా.. ఆమె కోసం ఎంత పెద్ద రిస్క్ చేస్తున్నాడో తెలుసా..!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ఇప్పటికే 75% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో రామ్ కి జంటగా శ్రీ లీల‌ నటిస్తుంది. ఇక రీసెంట్‌గా రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది ఈ చిన్న వీడియో.

Urvashi Rautela Boss Party Song Dance Steps For Waltair Veerayya Movie | Megastar Chiranjeevi | DSP - YouTube

ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం ఈ అమ్మాయికి భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం ఊర్వశికి ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.

10 Hottest Photos of Urvashi Rautela That Needs Your Attention

వాస్తవానికి ఈ అమ్మడి రేటు అంత ఎక్కువ ఏం కాదు.. కానీ బోయపాటి శ్రీను చెప్పిన మాస్ బోల్డ్ స్టెప్స్ కి ఈ అమ్మడు ఇంత పారితోష‌కం ఇవ్వాల‌ని డిమాండ్ చేసిందట. ఇక ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే రెమ్యూనరేషన్ విషయంలో ఎంతో సెలెక్టివ్ గా ఉండే బోయపాటి శ్రీను.. ఊర్వశి విషయంలో మాత్రం కాంప్ర‌మైజ్ అయిపోయారట. ఈ ముద్దుగుమ్మ అడిగిన రెమ్యూనరేషన్ అలాగే ఓకే చేస్తూ అగ్రిమెంట్‌పై సంతకం చేసేసారట.

Deepika Padukone to Urvashi Rautela, 5 Bollywood bombshells confirmed their Tollywood debut in 2020 | The Times of India

ఇక ఇప్పుడు దీంతో ఊర్వశీ మీద‌ బోయపాటికి చాలా ఎక్కువ ప్రేమే ఉంద‌ని… అందుకే ఆమెను ఈ రేంజ్ లో సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఊర్వ‌శి ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమాలో బాస్ పార్టీ ఐటెం సాంగ్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.