క‌ల‌ర్స్‌ స్వాతి విక్ట‌రీ వెంక‌టేష్‌కు మ‌ర‌ద‌లు పిల్ల అవుతుందా… !

ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా బుల్లితెర నుంచి వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఎదగడం అంటే సాధారణ విషయం కాదు. దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది మొదట్లో బుల్లితెర నటిగానే ఇండస్ట్రీకి పరిచయమైన కలర్ స్వాతి తర్వాత చాలా తక్కువ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. స్వాతి 30 ఆగస్టు 2018 వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొంత‌కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

Colors Swathi proposed to Venkatesh - video Dailymotion

ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి రీ ఏంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రస్తుతం కలర్ స్వాతి మంత్ అఫ్ మధు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఒక‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వాతి తన కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో చెప్పింది.

Aadavari Matalaku Ardhalu Verule Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

అదే క్రమంలో కలర్స్ స్వాతి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే సినిమాలో త్రిషకు చెల్లెలుగా వెంక‌టేష్ కి మ‌ర‌ద‌లిగా న‌టించ‌గా స్వాతి నటనకు ఎంతో గుర్తింపు వచ్చింది. వెంకటేష్ స్వాతిని ఆ సినిమా షూటింగ్ టైమ్ లో కూడా మరదలు పిల్ల అని ఆటపట్టించేవాడట‌. ఆ సినిమా తర్వాత స్వాతికి చాలామంది హీరోయిన్స్ కు చెల్లి లేదా స్నేహితురాలి పాత్రలో నటించాల‌ని ఆఫ‌ర్లు ఇచ్చార‌ట‌.

Aadavari Matalaku Arthale Verule Telugu Movie Part 1 | Venkatesh,Trisha - YouTube

అయితే ఆ అవ‌కాశాల‌ను తాను వ‌దులుకున్నాన‌ని.. త‌న‌కు ప్ర‌తిసారి అదృష్టం కొద్ది అవ‌కాశాలు రావ‌డంతో పాటు సక్సెస్ లు కూడా దక్కుతున్నాయి అంటూ స్వాతి త‌న సిని కెరీర్ గురించిన కొన్ని విష‌యాలు షేర్ చేసుకుంది.