బర్త్ డే స‌ర్‌ప్రైజ్ సెట్ చేసిన బాల‌య్య‌.. ఒకేసారి రెండు సినిమాల టైటిల్స్‌…!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం NBK 108 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా, శ్రీ లీల కి రోల్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పోస్టర్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులలో అంచనాలను పెంచేశాయి. బాలయ్య వరుస విజ‌యాల‌తో జోరు మీద ఉండ‌డంతో పాటు ఇప్ప‌టికే ఆరు వ‌రుస సూప‌ర్ హిట్ల డైరెక్ట‌ర్ అయిన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న కావ‌డంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

NBK 108 (2023) - IMDb

ఇక అసలు విషయానికి వస్తే జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు నాడు NBK 108 సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేయడానికి అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచే విధంగా ఉంటుందని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఇదేకాక ఆ రోజున తన కొత్త సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉందని యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహాతో బాలయ్య నెక్స్ట్ సినిమా సెట్స్ పైకి రానున్నట్టు ఆ సినిమాకి టైటిల్ కూడా ప్ర‌క‌టిస్తార‌న్న‌ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఒకేసారి రెండు సినిమాల టైటిల్స్ కాకుండా.. అఖండకి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఆ రోజు రిలీజ్ కానున్నాయట. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో బోయపాటి తెర‌క్కెకించ‌న్నున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఈ సినిమా ఎలక్షన్స్ ముందే రిలీజ్ కానుంది.

Balakrishna's Akhanda 2 To Release before 2024 Elections | Boyapati Srinu |  #Akhanda2 | News Mantra - YouTube

జనవరి నాటికి ఏపీలో ఎలక్షన్ మూడ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బాలయ్యకు ఎలక్షన్ పనుల్లో బిజీగా ఉండడంతో ఈలోపే కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనాప్పటికీ ఈ సంవత్సరం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ కి ఒకటికి మూడు సర్ ప్రైజ్ లు వ‌స్తున్నాయి.